జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించింది. ఈనెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మహా శివరాత్రి సందర్భంగా 15,16 తేదీలో సెలవు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 17 రోజులపాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అవసరమైతే పొడిగించాలని కూడా నిర్ణయించారు. ఇకపోతే ఈనెల 14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 17,18 తేదీలలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. 18న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌పై సమాధానం ఇవ్వనున్నారు. ఈ మేరకు బీఏసీలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏపీలో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 16వ శాసనసభ ఐదో సమావేశాలను ఫిబ్రవరి 10న ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటలకు అమరావతిలోని వెలగపూడిలో ఉన్న అసెంబ్లీ హాలులో ఉభయ సభలను (శాసనసభ, శాసనమండలి) ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు అడగడుగునా అడ్డుపడ్డారు. నిరసనలు, నినాదాల నడుమ గవర్నర్ ప్రసంగం జరిగింది.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజే వైసీపీ సభ్యులు వాకౌట్ అయ్యారు. మరోవైపు కూటమి సభ్యులు అసెంబ్లీకి హాజరయ్యారు.ఉదయం 9.30 గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 9.45 గంటలకు అసెంబ్లీకి హాజరయ్యారు. 9.57 గంటలకు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.