
జనం న్యూస్: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ పార్టీ సమర్పించిన అవిశ్వాస తీర్మానం ప్రకారం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(సీ) నిబంధనల ప్రకారం ఈ నోటీసును అందజేశారు. ఓం బిర్లాను లోక్‌సభ స్పీకర్ పదవి నుంచితొలగించాలని తీర్మానం నోటీసులో కోరారు. ఆయన లోక్‌సభ కార్యకలాపాలను స్పష్టంగా పక్షపాతంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అనేక సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులను మాట్లాడటానికి అనుమతించడం లేదని చెప్పారు. పార్లమెంట్లో మాట్లాడటం అనేతి ప్రతి సభ్యుని ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్, ఇండి కూటమిలోని పలు పార్టీలకు చెందిన ఎంపీలు ఈ అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక, లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసును సమర్పించడంపై లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు స్పందించాయి. ‘‘లోక్‌సభ స్పీకర్‌పై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సమర్పించాయి. దీనిని నిబంధనల ప్రకారం పరిశీలించి ప్రాసెస్ చేస్తారు’’ అని లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు పేర్కొన్నాయని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.