సంక్షేమ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి

జనం న్యూస్: ‘ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలలవారీగా సమీక్షించుకోవాలి. క్షేత్ర స్థాయిలో పనులను బేరీజు వేసుకోవాలి. ప్రతీ నెలా రెండు సార్లు కేబినెట్ సమావేశాలు, ఎస్ఐపీబీ ద్వారా ప్రాజెక్టులకు ఆమోదం ఇస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘గత 19 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలు, టెక్నాలజీ సహా ఏఐ అప్లికేషన్ల వినియోగం ఎలా జరుగుతుందో అంచనా వేసుకోవాలి అని సూచించారు. రాష్ట్రంలోని పేద ప్రజలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అవసరమే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలు అవసరమా.? అనే చర్చ సరి కాదు. పేదలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అవసరమే అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.‘ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలలవారీగా సమీక్షించుకోవాలి. క్షేత్రస్థాయిలో పనులను బేరీజు వేసుకోవాలి. ప్రతీ నెలా రెండు సార్లు కేబినెట్ సమావేశాలు, ఎస్ఐపీబీ ద్వారా ప్రాజెక్టులకు ఆమోదం ఇస్తున్నాం. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇంచార్జ్ మంత్రులు కూడా అదే వేగంతో క్షేత్రస్థాయిలో పనులు జరిగేలా చూడాలి అని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తల్లికి వందనం ద్వారా రూ.10వేల కోట్లు. ‘గత 19 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలు, టెక్నాలజీ సహా ఏఐ అప్లికేషన్ల వినియోగం ఎలా జరుగుతుందో అంచనా వేసుకోవాలి. క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలో ఉపకరణాలను కూడా తయారు చేసుకుని ఎగుమతులు చేసే పరిస్థితి వస్తుంది. ప్రతీ మూడు నెలలకోసారి ప్రభుత్వ ప్రగతి. పనుల పురోగతిపై బేరీజు వేస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘ఇలా ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవడంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఏమేరకు చేరుకున్నామన్న అంశంపై స్పష్టతతో ఉంటున్నాం. గడచిన 19 నెలల్లో అగాధం, అంధకారం నుంచి రాష్ట్రాన్ని బయటపడేశాం. వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టగలిగాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. తల్లికి వందనం ద్వారా రూ.10 వేల కోట్ల తల్లుల ఖాతాల్లో వేశాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.6310 కోట్లు. ‘స్త్రీశక్తి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ద్వారా మొబిలిటి పెరిగింది. 4.29 కోట్ల ప్రయాణాలు ఇప్పటి వరకూ జరిగాయి. ప్రస్తుతం ఉన్న బస్సులతోనే ఆక్యుపెన్సీ పెరిగింది. అన్నదాత సుఖీ భవ ద్వారా రూ. 6,310 కోట్ల ఆర్ధిక సహకారం అందించాం. డిమాండ్ డ్రివెన్ క్రాప్స్ ఉత్పత్తి చేసేలా అవగాహన పెంచుతున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘రాయలసీమలో హార్టి కల్చర్ హబ్, కోస్తాలో ఆక్వా కల్చర్ పెంచేలా చర్యలు చేపట్టాం. రైతు ఆత్మహత్యలనేవి జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే. వాటిని అధ్యయనం చేసి రైతులను ఆదుకుంటున్నాం. దీపం.2.0 ద్వారా 2 కోట్ల సిలెండర్లు ఇప్పటి వరకూ ఇచ్చాం.ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రూ.58 వేల కోట్ల మేర ఆర్ధిక చేయూత అందించాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై చర్చ. జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా పది సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. 2026-27లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తున్నారు.రియల్ టైమ్ గవర్నెన్సులో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్ ఇతర సాంకేతికత వినియోగంపై సమావేశంలో చర్చిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి, వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూయర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షిస్తున్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సైతం వర్చువల్‌గా హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *