ఏపీ అసెంబ్లీ సమావేశాలకు తేదీ ఖరారు

పయనించే సూర్యుడు న్యూస్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలపై వైసీపీ స్పష్టత ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలను ఫిబ్రవరి 11వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదు.అయితే ఈ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించుకుంది. అదికూడా ఒక్కరోజేనని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలా? వద్దా అనేదానిపై ఇప్పటి వరకు వైసీపీ తర్జన భర్జన పడుతున్న సంగతి తెలిసిందే. అయితే చివరికి వైసీపీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్న సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు వైసీపీ సభ్యులు సమావేశాలనికి హాజరవుతారని తెలుస్తోంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని నిరసిస్తూ వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్న సంగతి తెలిసిందే.అయితే వరుసగా 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైతే అనర్హత వేటు తప్పదు. ఈ క్రమంలో దాని నుంచి తప్పించుకునేందుకు వైసీపీ సభ్యులు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఒక్కరోజు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలని వైసీపీ నిర్ణయించింది. ఇప్పటి వరకు వరుసగా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్న వైసీపీ ఈ సారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఒకరోజు ఖచ్చితంగా హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గడచిన 6 నెలలుగా ఎప్పుడూ వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు.ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజులు వైసీపీకి హెచ్చరిక జారీ చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకునే అంశంపై ఎథిక్స్ కమిటీ పరిశీలిస్తోందని...కాబట్టి వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని సూచించారు. ఎమ్మెల్యేలు 60 రోజులు వరుసగా గైర్హాజరైతే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. 60 రోజులలో ఒక్కసారి అసెంబ్లీకి హాజరైనా సరిపోతుంది అని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు హింట్ కూడా ఇచ్చేశారు. దీంతో వైసీపీ సభ్యులు ఒకరోజు హాజరై అనర్హత వేటు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. వైసీపీ వ్యూహం ఇదేనా? ఇకపోతే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది.వచ్చే అసెంబ్లీ సమావేశాలకు హాజరై వైసీపీకి ప్రతిపక్ష హోదా...వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే సంఖ్యా పరంగా బలం లేకపోవడంతో ఇచ్చే అవకాశం లేదు అని మరోసారి కూడా స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లు తేల్చి చెప్పే అవకాశం ఉంది. అయితే స్పీకర్, కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ వైసీపీ సభ్యులు సమావేశాల నుంచి వాకౌట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల వైసీపీ ఒకరోజు అసెంబ్లీ సమావేశానికి హాజరైనట్లు ఉంటుంది టెక్నికల్‌గా అనర్హత వేటు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది అని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2027 తర్వాత మాత్రం ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ పాదయాత్ర చేసేందుకు వైఎస్ జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.