మరోసారి దేశవ్యాప్తంగా రైతు సంఘాల నిరసనలు

★ భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై తీవ్ర వ్యతిరేకత

సాక్షి డిజిటల్ న్యూస్ : దేశంలో మరోసారి అన్నదాతలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. భారత్, అమెరికా మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ ట్రేడ్ డీల్‌తో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్న రైతు సంఘాలు.. ఈనెల 12న దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిరసనలకు సంయుక్త కిసాన్ మోర్చా కూడా మద్దతు తెలిపింది. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా అన్నదాతలు దాదాపు 2 ఏళ్ల పాటు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో చేసిన ఆందోళనలు దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రైతుల సుదీర్ఘ నిరసనలతో దిగివచ్చిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. దిగి వచ్చి.. ఆ 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంతో.. రైతులు శాంతించారు. అయితే ఇప్పుడు మరో సమరానికి దేశంలోని రైతులు రెడీ అయ్యారు. భారత్-అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. దేశంలోని పలు రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ట్రేడ్ డీల్‌కు వ్యతిరేకంగా.. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం)తో పాటు మరికొన్ని రైతు సంఘాలు ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే శనివారం సంయుక్త కిసాన్ మోర్చా.. దాని అనుబంధ విభాగమైన ఆల్ ఇండియా కిసాన్ సభ సంయుక్తంగా ఒక ప్రకటనను విడుదల చేశాయి. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించాయి.ఈ ఒప్పందానికి భారత్ అంగీకరించడం అంటే..