రాజకీయ ఉద్రిక్తతల మధ్య ప్రాణభయాన్ని వ్యక్తం చేసిన మల్లారెడ్డి

జనం న్యూస్: మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్ గడి మలక్‌పేట్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో బీఆర్ఎస్ నాయకులకు గాయాలు అయ్యాయి, ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి వివరాలు అడిగితెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టిస్తోంది అని మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆరోపించారు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తమపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్లు నన్ను కూడా చంపేస్తారు అనుకున్నాను అని వాపోయారు. మా పార్టీ కౌన్సిలర్లతో, మా నాయకుడి ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటే డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ కావాలని డీజే బండి తెచ్చి ఫుల్ సౌండ్ పెట్టి డిస్టర్బ్ చేశారు అని మాజీమంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. పాటలు బంజేయండి అని అడిగినందుకు వజ్రేష్ యాదవ్ అనుచరులు తమ పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారని ఆరోపించారు. మీకు ప్రజల్లో మంచి పేరు లేకపోతే మా మీద దాడి చేయడం ఏంటి? అని మాజీమంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. మున్సిపల్, కార్పొరేషన్లలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలు నియమించిన ఇన్‌చార్జిలు పర్యటనలలో బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో కార్పొరేటర్లతో మాజీమంత్రి మల్లారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం అటుగా వెళ్తున్నారు. డీజే సౌండ్ ఎక్కువగా ఉండటంతో బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సౌండ్ తగ్గించాలని కోరారు. బీఆర్ఎస్ నేత ఢిల్లీ పరమేశ్‌ తలకు గాయాలు. మాజీమంత్రి మల్లారెడ్డి తన అనుచరులను పంపించి సౌండ్ తగ్గించమని రిక్వస్ట్ చేసినట్లు వెల్లడించారు. అయితే డీజే నిర్వాహకుడు తాళం వేసుకుని వెళ్లిపోవడంతో తమ అనుచరుడు ఢిల్లీ పరమేశ్ వెళ్లి తీగలాగేందుకు ప్రయత్నించినట్లు మాజీమంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. ఇంతలో కాంగ్రెస్ శ్రేణులు దూసుకువచ్చారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మాజీమంత్రి మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేశ్‌ తలకు గాయాలు అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తనను కూడా చంపేస్తారని తాను భయపడినట్లు మాజీమంత్రి మల్లారెడ్డి తెలిపారు. మాజీమంత్రి మల్లారెడ్డికి కేటీఆర్ ఫోన్. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలపై జరుగుతున్న దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. కాంగ్రెస్ గూండాల దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.ఈ సందర్భంగా మాజీమంత్రి మల్లారెడ్డికి ఫోన్ చేసి జరిగిన దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మర్రి రాజశేఖర్‌కు సైతం ఫోన్ చేసి దాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ రాజు శంభీపూర్, ఎమ్మెల్యే కేపీ వివేకానందలను మాజీమంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిల వద్దకు వెళ్లాలని కేటీఆర్ ఆదేశించారు. దేదీప్యపై దాడిని ఖండించిన కేటీఆర్ జూబ్లీహిల్స్ లో కార్పొరేటర్ దేదీప్య పైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఆయన అనుచరులు చేసిన దాడిని సైతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. దేదీప్యతో ఫోన్లో మాట్లాడి ధైర్యంగా ఉండాలన్న కేటీఆర్ సూచించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను దేదీప్య వద్దకు వెళ్లాలని ఆదేశించారు. ఈ క్రమంలో దేదీప్యను పార్టీ శ్రేణులు పరామర్శించి ధైర్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *