భారత్‌-అమెరికా ట్రేడ్‌డీల్ ఖరారు వాణిజ్య సుంకాల్లో భారీ తగ్గింపు!

పయనించే సూర్యుడు న్యూస్ : భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఇరు దేశాల మధ్య పరస్పర, సమతుల్య వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ముసాయిదాను సంయుక్తంగా విడుదల చేశాయి.ఈ ముసాయిదా ప్రకారం భారత్ ఉత్పత్తులపై విధించిన ఎక్సైజ్ సుంకం 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. భారత్‌ – అమెరికా మధ్య కీలకమైన ట్రేడ్‌ డీల్‌ కుదిరింది. ఈ మేరకు భారత్‌తో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అమెరికా అధికారిక ముసాయిదాను విడుదల చేసింది.అటు రెండు దేశాల మధ్య పరస్పర, సమతుల్య వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ముసాయిదాను భారత్ సైతం విడుదల చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయడానికి అంగీకరించినట్లు అమెరికా పేర్కొంది. భవిష్యత్తులో అమెరికా నుంచి ఇంధనం, గ్యాస్‌ను పెద్దఎత్తున దిగుమతి చేసుకోవాలని భారత్‌ నిర్ణయించిందని వైట్ హౌస్ పేర్కొంది. ఈ క్రమంలో భారత ఉత్పత్తులపై సుంకాన్ని 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినట్లుగా వెల్లడించింది. అమెరికా నుంచి 500 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులకు భారత్‌ అంగీకరించిందని పేర్కొంది. రాబోయే ఐదేళ్లలో ఎనర్జీ, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయం వంటికీలక రంగాల్లో అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించింది. అంతేకాదు ఈ ఒప్పందం విజయవంతమైతే భవిష్యత్తులో పరస్పర సుంకాలను పూర్తిగా తొలగించే దిశగా అగ్రరాజ్యం అమెరికా అంగీకరించింది. అమెరికా- భారత్ మధ్య కుదిరిన ఒప్పందం- ఇవే నిబంధనలు రాబోయే ఐదేళ్లలో అమెరికా నుంచి ఏకంగా 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నట్లు భారత్ ప్రకటనలో వెల్లడించింది. కొనుగోలు చేసే వస్తువులలో ఇంధన ఉత్పత్తులు, విమానాలు, టెక్నాలజీ ఉత్పత్తులు, కోకింగ్ కోల్ ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది.వీటితోపాటు డేటా సెంటర్లలో వాడే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల వాణిజ్యాన్ని పెంపొందించుకునేందుకు ఈ ఒప్పందంలో అంగీకారం కుదిరించింది. మరోవైపు డిజిటల్ వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను తొలగించి…సరఫరా గొలుసు భద్రతపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. జెనరిక్‌ మందులు, విమాన విడిభాగాలపై జీరోశాతం సుంకం భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్త్రాలు,తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు, ఆర్గానిక్ కెమికల్స్, హోమ్ డెకర్, హస్తకళా ఉత్పత్తులతోపాటు మరికొన్ని రకాల యంత్రాలపై 18 శాతం సుంకాన్ని అమెరికా విధిస్తుంది. జెనరిక్ మందులు, రత్నాలు, వజ్రాలు, విమాన విడిభాగాలతో సహా విస్తృత శ్రేణి వస్తువులపై ఈ పరస్పర సుంకాన్ని అమెరికా తొలగిస్తుంది. జాతీయ భద్రతా కారణాలతో స్టీల్, అల్యూమినియంపై విధించిన పాత ఆంక్షల నుంచి భారత విమాన విడిభాగాలకు మినహాయింపు లభిస్తుంది. ఆటోమొబైల్ విడిభాగాల ఎగుమతిలో భారత్‌కు ప్రత్యేక కోటా దక్కనుంది. వీటితో పాటు, ఫార్మాస్యూటికల్స్, వాటి ముడి పదార్థాలపై భారత్ ప్రత్యేక రాయితీలను అందుకోనుంది. 30 ట్రిలియన్ డార్ల మార్కెట్‌ను ఒప్పందం తెస్తోంది:కేంద్రమంత్రి పీయూష్ గోయల్ భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం భారతీయ ఎగుమతిదారులకు 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకువస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లోపోస్ట్ చేశారు. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల ఎంఎస్‌ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు ఎంతో లబ్ధిచేకూరుతుంది అని కేంద్రమంత్రి తెలిపారు.మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారత్‌ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని వెల్లడించారు.‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృఢ నాయకత్వంలో భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుంది. ఇది భారత ఎగుమతిదారులకు ప్రత్యేకించి ఎంఎస్‌ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌ను తెరుస్తుంది. ఎగుమతుల పెరుగుదల లక్షలాది కొత్త ఉద్యోగాలను, ముఖ్యంగా మహిళలు, యువతకు అవకాశాలను సృష్టిస్తుంది. ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది’ అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. గ్రామీణ జీవనోపాధిని నిలబెట్టే ఒప్పందం మరోవైపు భారతీయ రైతులు, పాడిపరిశ్రమ ప్రయోజనాలను పూర్తిగా కాపాడతామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మొక్కజొన్న, గోధుమ, వరి, సోయా, పౌల్ట్రీ ఉత్పత్తులు, పాలు, చీజ్, ఇథనాల్, పొగాకు, కొన్ని కూరగాయలు, మాంసం వంటి వ్యవసాయ, పాల ఉత్పత్తులకు పూర్తిగా రక్షణ కల్పిస్తామని ప్రకటించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు గ్రామీణ జీవనోపాధిని నిలబెట్టే విషయంలో భారత్‌ నిబద్ధతను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుంది అని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *