ఇక్కడే గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్

★ ప్రపంచానికి సరికొత్త ఆవిష్కరణలు అందించే అవకాశాలు ఇక్కడే ఉన్నాయి: సీఎం చంద్రబాబు

పయనించే సూర్యుడు న్యూస్ :  దేశానికి గేమ్ ఛేంజర్‌గా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచానికి సరికొత్త ఆవిష్కరణలు అందించే అవకాశాలు ఇక్కడే ఉన్నాయని తెలిపారు. వచ్చే 40 ఏళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేపట్టామన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌తో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దేశానికి గేమ్ ఛేంజర్‌గా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచానికి సరికొత్త ఆవిష్కరణలు అందించే అవకాశాలు ఇక్కడే ఉన్నాయని తెలిపారు. వచ్చే 40 ఏళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేపట్టామన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌తో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. దేశానికి సరైన సమయంలో సరైన వ్యక్తి ప్రధానిగా ఉన్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. క్వాంటమ్ మిషన్ కార్యకలాపాలు ఏపీ నుంచే ప్రారంభం కావాలని తాను కోరానని, టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ ప్రతినిధులతో మాట్లాడానని అన్నారు. ఒకటి రెండు నెలల్లోనే ఒప్పందాలు పూర్తి కావాలని కంపెనీలను కోరానన్నారు. ఈ ఏడాది చివరి నాటికి మొదటి క్వాంటమ్ కంప్యూటర్ కావాలని చెప్పానని, ఏప్రిల్ 14న ఇక్కడే మరో రెండు క్వాంటమ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదే జరిగితే 2030 లోగా 2.5 లక్షల మంది క్వాంటమ్ నిపుణులు కావాలని వివరించారు. దేశంలోని వంద మంది ఐటీ నిపుణుల్లో 35 శాతం మంది తెలుగువాళ్లే ఉన్నారని చెప్పారు. ఏపీకి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటింగ్ గేమ్ ఛేంజర్లు:  ప్రస్తుత తరుణంలో ఏపీకి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటింగ్ గేమ్ ఛేంజర్లు అని చంద్రబాబు చెప్పారు. క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేసిన ఈరోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి కూడా కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఐటీ శాఖను మంత్రి నారా లోకేశ్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కితాబు ఇచ్చారు. ఈనెల 16న బిల్ గేట్స్ అమరావతికి వస్తున్నారని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్రమంత్రులు నారా లోకేశ్, నారాయణ, కందుల దుర్గేశ్ తదితరులు పాల్గొని, శంకుస్థాపన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.