దివ్యాంగుల నియామకాలపై కీలక నిర్ణయం ప్రకటించిన ప్రభుత్వం

జనం న్యూస్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్ ల్యాగ్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి మార్చిలోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలి అని దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సూచించారు. దివ్యాంగులకు ఉచితంగా ఇచ్చే త్రీవీలర్ మోటార్ సైకిళ్ల పంపిణీకి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక త్వరితగతిన పూర్తి చేయాలి అనిదివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు చంద్రబాబు నాయుడు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్ ల్యాగ్ పోస్టులు ఈ ఏడాది మార్చిలోపు భర్తీ చేయాలని దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమీక్ష సమావేశం నిర్వహించారు. దివ్యాంగులకు UDID కార్డులు, త్రీవీలర్ మోటార్ బైక్ ల పంపిణీ, దివ్యాంగ పాఠశాలల్లో అడ్మిషన్లు, వయోవృద్ధులకు వయో వందన ఆయుష్మాన్ భారత్ కార్డులు, సహాయ పరికరాల పంపిణీ, ట్రాన్స్ జెండర్స్‌కి గుర్తింపు కార్డులు, నైపుణ్య శిక్షణ తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. దివ్యాంగుల బ్యాక్ ల్యాగ్ పోస్టుల భర్తీ చేయాలి. మరోవైపు దివ్యాంగ పాఠశాలల్లో అడ్మిషన్లపై విస్తృత ప్రచారం కల్పించాలి. అడ్మిషన్లు 100 శాతం పూర్తి కావాలి దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అని ఆదేశించారు. దివ్యాంగ పాఠశాలల్లో మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి అని ఆదేశించారు. ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలి. విద్యార్థులకు మెనూ అమలులో రాజీపడొద్దు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సాహించాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్ ల్యాగ్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి మార్చిలోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలి అని సూచించారు. దివ్యాంగులకు ఉచితంగా ఇచ్చే త్రీవీలర్ మోటార్ సైకిళ్ల పంపిణీకి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక త్వరితగతిన పూర్తి చేయాలి. వయో వృద్ధులకు సహాయ పరికరాలు ఎక్కువ మందికి పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. అంబేద్కర్ గరుకులాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి. డా.బి ఆర్ అంబేద్కర్ గరుకులాల్లో 100 శాతం ఉత్తీర్ణత,100 శాతం అడ్మిషన్లే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. తాడేపల్లి APSWREIS కార్యాలయంలో డీసీవోలు, ప్రిన్సిపాళ్ళతో మంత్రి జామ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పది, ఇంటర్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధం, వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లపై సుమారు 3 గంటల పాటు ఈ సమావేశంలో మంత్రి సమీక్షించారు. పాఠశాలల వారీగా ఎంత మంది విద్యార్థులు పాస్ అవుతారు, ఎంతమంది విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…ప్రతి పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి. ఉత్తీర్ణత శాతం పెంచితే డిసివోలు, ప్రిన్సిపాళ్లకు సన్మానాలు చేస్తాం, ఉత్తీర్ణతా శాతం తగ్గితే మెమోలు జారీ చేస్తాం. వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలి. ప్రభుత్వ కార్యాలయాలు, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. అడ్మిషన్ల పెంపునకు ఆయా జిల్లాల కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాలి. పేద విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రస్తుతం ఉన్న నీట్, ఐఐటీ ఎక్సలెన్సీ సెంటర్లను మరిన్ని ఏర్పాటు చేస్తాం. ప్రిన్సిపాళ్లు విద్యార్థుల చేత ఎంసెట్, ఐఐటీ, నీట్, పలు ప్రఖ్యాత యూనివర్సిటీలకు దరఖాస్తులు చేయించాలి. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సిబ్బంది బాద్యతయుతంగా పనిచేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కృషి చేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ సమావేశంలో APSWREIS సెక్రటరీ IAS వి. ప్రసన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *