నువ్వు ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా?

★సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.నువ్వు ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా? అని నిలదీశారు. అవ్వతాతలు పెన్షన్ అడిగితే లాగుల తొండలు వదులుతా అంటావా అని మండిపడ్డారు. ఆడబిడ్డలు మహాలక్ష్మి రూ.2500 అడిగితే పేగులు తీసి మెడలో వేసుకుంటానని అంటావా? అని మాజీమంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ‘రేవంత్ రెడ్డి.. నువ్వు ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా? అని అడుగుతున్నా. అవ్వతాతలు రూ. 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావ్ అని అడిగితే లాగుల తొండలు వదులుతా అంటావా?’అని మాజీమంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బాండ్ పేపర్లు రాసిచ్చి, అమ్మతోడు అని చెప్పి మోసం చేశావు కదా అని మండిపడ్డారు. ఆడబిడ్డలు మహాలక్ష్మి రూ. 2500 అడిగితే 'పేగులు తీసి మెడలో వేసుకుంటా' అంటావా? ఇదేనా నీ సంస్కారం? నీ రౌడీయిజం సాగదు ఖబర్దార్ అని మాజీమంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి గెలిచే దమ్ములేక....ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభపెట్టి పార్టీలు మారుస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మెదక్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడిన మాజీమంత్రి హరీశ్ రావు...ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషపై, పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గెలిచే దమ్ములేక మా అభ్యర్థులను ఎత్తుకెళ్తున్నారు.. వడ్డీతో సహా చెల్లిస్తాం గుర్తుపెట్టుకోండి అని మాజీమంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ లేకపోతే సీఎం కుర్చీలో కూర్చుండేవాడివా? తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి పదవులను గడ్డిపోచల్లా విసిరేసిన మహనీయుడు కేసీఆర్ అని మాజీమంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు.కేసీఆర్ చెబితే మేము కూడా పదవులకు రాజీనామా చేసి ఆంధ్రా పాలకుల ముఖం మీద కొట్టినం. మరి నువ్వు? రాజీనామా చేయమంటే జిరాక్స్ పేపర్ పంపిన దొంగవు అని మాజీమంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన ద్రోహివి అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చారు కాబట్టే నువ్వు ఈరోజు సీఎం కుర్చీలో ఉన్నావు. లేకపోతే ఆంధ్రాలో మోచేతి నీళ్లు తాగుతూ, బ్యాగులు మోసుకుంటూ బతికేవాడివి అని మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రైతులు నీ చెడ్డీల తొండలు తొడిగి ఏడిపిస్తారు ‘కాంగ్రెస్ పార్టీకి గెలిచే సత్తా ఉంటే మా అభ్యర్థులను ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? జనం మీకు ఓటు వేయరని అర్థమై పోలీసులతో బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి కండువాలు కప్పుతున్నారు’అని మాజీమంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎవరెవరు అమ్ముడుపోతున్నారో, ఎవరు ఎందుకు ఎత్తుకుపోతున్నారో అందరినీ గుర్తుపెట్టుకుంటాం. సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాం’అని మాజీమంత్రి హెచ్చరించారు.‘ఇప్పటివరకు రైతు బంధు ఇవ్వలేదు. ఫిబ్రవరి 11వ తేదీలోగా రైతు బంధు పడకపోతే.. రైతులు నీ చెడ్డీల తొండలు తొడిగి ఏడిపిస్తారు. నిన్ను చీరిచింతకు చెండాడుతారు. రుణమాఫీ పేరుతో దేవుళ్లనే మోసం చేసిన ఘనుడివి నువ్వు. నీ అబద్ధాలను రైతులు నమ్మే స్థితిలో లేరు’అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు.