ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు… మా ప్రభుత్వం వచ్చాక ఎవరినీ వదలం

* వైసీపీ అధినేత వైఎస్ జగన్

సాక్షి డిజిటల్ న్యూస్: రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని…ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయని చెప్పుకొచ్చారు. రేపు వచ్చేది తమ ప్రభుత్వమేనని అప్పుడు ఎవరినీ వదిలేది లేదని..తప్పు చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం అని వైఎస్ జగన్ హెచ్చరించారు. మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పుబట్టారు. అంబటి రాంబాబు మీద అంత మంది దాడి చేస్తే, తన కారును అడ్డగిస్తే, బూతులు తిడితే కాస్త కటువైన పదం దొర్లింది అని దానికి క్షమాపణలు కూడా చెప్పారని గుర్తు చేశారు. అయినప్పటికీ అంబటి రాంబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. మరి అదే అంబటి రాంబాబును హత్య చేసేందుకు సాయంత్రం 5 గం. నుంచి అర్ధరాత్రి వరకు విధ్వంసం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి. మనుషులతో వచ్చి విధ్వంసం సృష్టించారు. 5 కార్లు ధ్వంసం చేశారు. ఇంట్లో, ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఆయన గల్లా మాధవి భర్త. ఆయన సాక్షాత్తూ అంబటి రాంబాబు ఆఫీసు పగలగొట్టారు. చివరకు నిప్పు పెట్టారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగాయి. 5 కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు, ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్నా, వెనక్కి తగ్గలేదు’ అని వైఎస్ జగన్ ఆరోపించారు. మాజీమంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు. టీడీపీ గుండాలు మొత్తం విధ్వంసం చేసిన, గుంటూరులోని అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్‌ను సందర్శించి, ఆ విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూశారు. అంబటి కారును ఏ విధంగా ధ్వంసం చేసింది చూసిన ఆయన, దాడి ఏ స్థాయిలో చేశారనేది గమనించారు. మొత్తం దాడి ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అంబటి రాంబాబు భార్య, కుమార్తెలు, కుటుంబ సభ్యులను కలుసుకుని పరామర్శించిన శ్రీ వైయస్‌ జగన్‌. అంబటి రాంబాబు కుటుంబానికి ఓదార్పు. ఏ మాత్రం అధైర్యపడొద్దని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యం ఖూనీ. జంగిల్‌రాజ్‌ ‘రాష్ట్రంలో ఈరోజు జంగిల్‌రాజ్‌ అనేది ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు. ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఈరోజు అంబటి విషయంలో జరిగింది అయితే ఏమి, అలాగే జోగి రమేష్‌ ఇంటిమీద దాడి అయితేనేమి, విడదల రజిని, బొల్ల బ్రహ్మనాయుడి మీద దాడి.. ఇవన్నీ ఇటీవలి కొన్ని ఘటనలు. ఇవన్నీ రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను సూచిస్తున్నాయి’అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ‘అసలు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్, భూమన కరుణాకర్‌రెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు.. వారంతా చేసిన తప్పేమిటి?అని నిలదీశారు. దాదాపు ఏడాదిన్నర నుంచి చంద్రబాబు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ, ప్రజలను మభ్య పెట్టే పని చేస్తున్నారు అని జగన్ మండిపడ్డారు. పవిత్రమైన తిరుపతి నెయ్యిలో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, కుట్రపూరితంగా, ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసింది అంటూ.. రకరకాలుగా దుష్ప్రచారం చేశారు అని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబునాయడు, ఆయన కొడుకు లోకేష్, పవన్‌కళ్యాణ్‌.. ఉద్దేశపూర్వకంగా, శ్రీవెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భయం, భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుణ్ని వాడుకున్నారు. వారు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ.. రెండు ల్యాబ్‌లు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి. ఆ రెండు ల్యాబ్‌లు వీరు పంపించిన నెయ్యిని పరీక్షించారు. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేపనూనె వంటి ఏ అవశేషాలు లేవని సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఆ నివేదికా ఆధారంగా సీబీఐ, సిట్‌ ఛార్జ్‌షీట్‌ వేసింది’ అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. క్షమాపణ కోరాల్సింది పోయి అబద్దాలు ప్రచారం చేస్తారా? ‘శ్రీవారి లడ్డూ కల్తీ కాలేదు అని నిర్ధారణ కావడంతో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, పవన్‌ కళ్యాణ్‌‌లు చేసిన తప్పుకు చెంపలేసుకుని, క్షమాపణ కోరాల్సింది పోయి మళ్లీ మళ్లీ అవే అబద్ధాలు ప్రచారం చేస్తూ.. వాస్తవాలు వక్రీకరిస్తూ, ఫ్లెక్సీలు పెట్టారు’అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘తప్పుడు సమాచారంతో రెచ్చగొట్టే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుందా?. మేము కూడా ఇలా ఫ్లెక్సీలు పెడితే ఎలా ఉంటుంది చంద్రబాబు?. సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్‌ అని చెప్పి మోసం చేశారని ఫ్లెక్సీలు పెడితే ఊరకుంటారా? అబద్దాలు చెబుతూ, దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు పెట్టడం తప్పు. వాస్తవాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్‌లు స్పష్టంగా చెప్పినా, చంద్రబాబు వెనక్కు తగ్గడం లేదు’అని వైఎస్ జగన్ మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *