మున్సిపల్ ఎన్నికలవగానే ఇంటి పన్ను పెంచుతారు

★బండి సంజయ్

సాక్షి డిజిటల్ న్యూస్: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. అలాగే బీఆర్ఎస్‌కు ఓట్లు వేస్తే డ్రైనేజీలో వేసినట్టేనని అన్నారు. బండి సంజయ్ సోమవారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా.. పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీని వీడబోమని, పార్టీ కోసం, సమాజాభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడుతూ.... రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేళ్లు గడిచిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఒక్క పైసా కూడా నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. అందుకే ఈ ఎన్నికల్లో వారికి ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంటి పన్ను పెంచి, ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. అదే సమయంలో బీఆర్ఎస్‌పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆ పార్టీ నాయకులు ప్రజాధనాన్ని దోచుకున్నారని, భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలను దోచుకుతిన్న బీఆర్‌ఎస్‌ నేతలకు ఎందుకు ఓటేయాలని సంజయ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో లేని ఆ పార్టీ కరీంనగర్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ అభివృద్ధి కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తుందని ప్రశ్నించారు.