
సాక్షి డిజిటల్ న్యూస్ : భారత్ 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానంలో భాగంగా పలు పొరుగు దేశాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. అత్యధికంగా భూటాన్‌కు రూ.2,250 కోట్ల మేర కేటాయించడం చెప్పుకోదగ్గ అంశం. కానీ, బంగ్లాదేశ్‌కు కేటాయించిన నిధులను భారీగా తగ్గించింది. అక్కడ మైనార్టీలపై దాడులు, పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం.. ఈ దాడులను వ్యక్తిగత వైషమ్యాలకు ఆపాదించడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానంలో భాగంగా ఏటా బడ్జెట్‌లో పొరుగు, స్నేహపూర్వక దేశాలకు కేంద్రం కొన్ని కేటాయింపులు చేస్తుంది. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ సహా పలు దేశాలకు మొత్తం రూ.5,683 కోట్లు కేటాయించింది. అయితే, గత ఏడాదిన్నరగా దౌత్య సంబంధాలు క్షీణిస్తున్న బంగ్లాదేశ్‌కు మాత్రం భారీ ఝలక్ ఇచ్చింది. కిందటి బడ్జెట్ (రూ.120 కోట్లు)తో పోల్చితే సగానికి సగం కోత విధించింది. కేవలం రూ.60 కోట్లు మాత్రమే ప్రతిపాదించింది. ఆగస్టు 2024లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆ దేశంలో మైనార్టీలు ముఖ్యంగా హిందువులపై హింస, పాకిస్థాన్‌కు దగ్గరవుతుండటంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌లో నివాసాలు, ఆస్తులు, వ్యాపారాలు, ఆలయాలు సహా మైనార్టీలపై దాడులు గురించి వస్తోన్న నివేదికలను నిరంతరం గమనిస్తూనే ఉన్నామని రాజ్యసభకు కేంద్రం గురువారం తెలియజేసింది. మైనార్టీల భద్రత, రక్షణ అంశంపై భారత్ పలుసార్లు బంగ్లాదేశ్ అధికారులతో రాజకీయ, దౌత్యస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్దన్ సింగ్ తెలిపారు. గతేడాది ఏప్రిల్ 25న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహ్మమద్ యూనస్‌తో భేటీ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ అంశాన్ని లేవనెత్తారని చెప్పారు.