ఎన్నికల తర్వాత పన్నుల పెంపుపై బండి సంజయ్ విమర్శలు

జనం న్యూస్: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. అలాగే బీఆర్ఎస్‌కు ఓట్లు వేస్తే డ్రైనేజీలో వేసినట్టేనని అన్నారు. బండి సంజయ్ సోమవారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీని వీడబోమని, పార్టీ కోసం, సమాజాభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేళ్లు గడిచిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఒక్క పైసా కూడా నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. అందుకే ఈ ఎన్నికల్లో వారికి ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంటి పన్ను పెంచి, ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. అదే సమయంలో బీఆర్ఎస్‌పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆ పార్టీ నాయకులు ప్రజాధనాన్ని దోచుకున్నారని, భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలను దోచుకుతిన్న బీఆర్‌ఎస్‌ నేతలకు ఎందుకు ఓటేయాలని సంజయ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో లేని ఆ పార్టీ కరీంనగర్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ అభివృద్ధి కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తుందని ప్రశ్నించారు. పొరపాటున బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తే డ్రైనేజీలో పడ్డట్లేనని అన్నారు. బీఆర్‌ఎస్‌ గెలిస్తే కమీషన్ల కోసం కేంద్ర నిధులను దారి మళ్లిస్తుందని ఆరోపించారు. కరీంనగర్‌లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరిగిందని అన్నారు. స్మార్ట్‌ సిటీ సహా అనేక రూపాల్లో నిధులు తీసుకొచ్చి కరీంనగర్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి దక్కితే. తాను నగరానికి మరిన్ని నిధులు తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటానని ఆయన అన్నారు. బీజేపీ అభ్యర్థుల మీద అవినీతి ఆరోపణలు లేవని బండి సంజయ్‌ చెప్పారు. ఇప్పుడు పోటీ చేస్తున్నవారంతా. తనను ఎంపీగా గెలిపించేందుకు ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయించారని, ఇప్పుడు వాళ్లను గెలిపించేందుకు తాను ఓట్లు అడుగుతున్నానని తెలిపారు. ప్రజల కోసం నిత్యం పని చేసే, నిజాయితీ, నిబద్ధత కలిగిన బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కరీంనగర్ మరింత అభివృద్ధి చెందాలన్నా, మరిన్ని నిధులు రావాలన్నా బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *