చంద్రబాబు నాయుడు కేసులో ఈడీ క్లీన్ చిట్ ప్రకటించింది

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కోణంపై విచారణ చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చంద్రబాబు నాయుడుకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీమెన్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మనీలాండరింగ్ లేదా నేర కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిర్వహించడంలో సీఎం చంద్రబాబు పాత్ర ఉన్నట్టుగా తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈడీ తెలిపింది. విశాఖపట్నంలోని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కోర్టులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో ఈడీ ఈ మేరకు వెల్లడించింది. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసింది. ఈ కేసుకు సంబంధించిన నేర కార్యకలాపాల ఆదాయానికి సంబంధించిన కార్యకలాపాలలో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉన్నట్లు తమ దర్యాప్తులో వెల్లడి కాలేదని ఈడీ పేర్కొంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబుతో పాటు ఇతర నిందితులకు ఊరట కల్పించే విధంగా వారిపై విచారణను మూసివేస్తూ ఏసీబీకోర్టు ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే. కేసు ఏమిటి? ఏపీలో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 40 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసే లక్ష్యంతో ఏపీ స్కిల్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్. సీమెన్స్, డిజైన్ టెక్ సిస్టమ్స్ వంటి సంస్థల ఒప్పందం చేసుకుంది. తద్వారా యువతకు సాంకేతిక శిక్షణ ఇవ్వడం ప్రధాన ఉద్దేశం. అయితే ఇందులో రూ. 371 కోట్ల దుర్వినియోగం అయినట్టు గత వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన సీఐడీ, విచారణ చేపట్టింది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొని. 2023 సెప్టెంబరు 9న సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీనిపై ఏసీబీ కోర్టులో, హైకోర్టులో టీడీపీ న్యాయ పోరాటం చేసింది. అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. దాదాపు 53 రోజుల తర్వాత 2023 అక్టోబరు 31 వరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో చంద్రబాబుకు ఊరట లభించింది. అయితే ఈ కేసుకు సంబంధించి సీఐడీ సమగ్ర దర్యాప్తు పూర్తి చేసి, తగు నిర్ణయం తీసుకునే నిమిత్తం ఇటీవల ఏసీబీ కోర్టులో తుది నివేదిక దాఖలు చేసింది. అయితే ఈ కేసులో తీర్పును వెలువరించే ముందు తన వాదనలను వినాలని స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అప్పటి ఛైర్మన్‌ అజయ్‌రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రాసిక్యూషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు. సీఐడీ తరఫున న్యాయవాదులు ఉన్నం అఖిల్‌ చౌదరి, కొమర చక్రపాణి. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వినోద్‌ దేశ్‌పాండే వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు అజయ్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే సీఐడీ తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన ఏసీసీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి. అజయ్‌రెడ్డి పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వులిచ్చారు. ‘మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌’ కారణంగా పేర్కొంటూ నిందితులపై విచారణను మూసివేశారు. ఈ కేసులో చంద్రబాబుతోపాటు మొత్తం 37 మంది నిందితులకు ఆరోపణల నుంచి విముక్తి కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *