
సాక్షి డిజిటల్ న్యూస్ : ఖనిజ వనరులు ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రసంగంలో ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం 4 రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఏపీ,ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఖనిజాల కోసం ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తమిళనాడు, కేరళ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రత్యేక మైనింగ్ మిషన్స్ ఏర్పాటు చేయనున్నారు. దీనితో పాటు ప్రపంచస్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ మిషన్ ద్వారా ఖనిజ వనరుల సమర్థ వినియోగం, సుస్థిర మైనింగ్, పెట్టుబడుల ఆకర్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఖనిజ రంగంతో పాటు తయారీ రంగంలోనూ భారత్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో కీలకమైనదని నిపుణులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక ‘రేర్ ఎర్త్ కారిడార్లను’ ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2025లో ప్రారంభించిన అరుదైన ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ స్కీమ్‌కు కొనసాగింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేర్ ఎర్త్ కారిడార్ల ఏర్పాటు ద్వారా ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో భారతదేశం స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ ఇవే! నెల్లూరు తీర ప్రాతంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్(REE) మరియు థోరియం యొక్క ప్రాథమిక వనరు అయిన మోనాజైట్, ఇల్మెనైట్, రూటిల్, జిర్కాన్, గార్నెట్ , సిల్లిమనైట్లతో పాటు మరిన్ని ఖనిజాలు ఉన్నట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్‌లో పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్‌లో రేర్ ఎర్త్ మినరల్స్‌లో తీర ప్రాంతంలో మోనాజైట్ 55-60% రేర్ ఎర్త్ ఆక్సైడ్లను కలిగి ఉంది. దీనితో పాటు 8-10% థోరియం ఉన్నట్లు గుర్తించారు. దీనితో పాటు హైదరాబాద్‌లోని CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం నగరంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్(REE) ఉనికిని కనుగొన్నారు. ఏపీలో గుర్తించిన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌లో లాంథనమ్, సీరియం, ప్రసోడైమియం, నియోడైమియం, యిట్రియం, హాఫ్నియం, టాంటాలమ్, నియోబియం, జిర్కోనియం , స్కాండియం ఉన్నాయి. అసలేంటి రేర్ ఎర్త్ మినరల్స్! రేర్ ఎర్త్ అనేది 17 మూలకాల సమూహం, ఇవి స్మార్ట్ఫోన్ల వంటి వినియోగదారు ఎలక్ట్రానిక్స్ నుండి ఎలక్ట్రిక్ వాహనాలు , ఫైటర్ జెట్ల వరకు ప్రతీదానిలో ఎంతో కీలకంగా ఉపయోగిస్తారు. రేర్ ఎర్త్ మెటల్స్ విషయంలో ప్రపంచ దేశాల్లో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది , ప్రపంచ గనుల ఉత్పత్తిలో దాదాపు 60% , రీఫైన్ చేసిన ప్రొడక్ట్స్, అరుదైన భూమి అయస్కాంత ఉత్పత్తిలో దాదాపు 90% వాటాను కలిగి ఉంది.