
పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. అమరావతి అభివృద్ధి కోసం 1128 కోట్లు కేటాయించారు. అలాగే అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ కోసం 432 కోట్లు కేటాయించారు. ఏపీలో తాగునీరు, డ్రైనేజీ నిర్వహణ కోసం 800 కోట్లు, గ్రామీణ ప్రాంతాలలో రహదారుల ప్రాజెక్టుల కోసం రూ.500 కోట్లు కేటాయించారు. కేంద్ర బడ్జెట్ మీద మంత్రి నారా లోకేష్ సైతం కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు. 2026-27లో ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం నిధులు కేటాయించింది. రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే ప్రణాళికలకు అనుగుణంగా.. బడ్జెట్లో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించింది. అమరావతి రాజధాని అభివృద్ధి కోసం రూ.1,128.91 కోట్లు కేటాయించారు. ఏడీబీ నిధుల కింద ఈ కేటాయింపులు చేశారు. అమరావతి సమీకృత పట్టణాభివృద్ధికి అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద.. ఐబీఆర్డీ ద్వారా రూ.432.09 కోట్ల నిధులు కేటాయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాలలో తాగునీరు, మురుగు నీటి పారుదల నిర్వహణ కోసం కేంద్ర బడ్జెట్లో రూ.800 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ రహదారుల ప్రాజెక్టులకు రూ.500.99 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఏపీలోని రహదారులు, వంతెనల పునర్నిర్మాణ పనుల కోసం రూ.350 కోట్ల కేటాయింపులు జరిగాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సేద్యం విధానాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం 2026 బడ్జెట్లో రూ.155.32 కోట్లు నిధులు కేటాయించింది. వీటితో పాటుగా ఏపీలో రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు, ఏపీ మీదుగా హైస్పీడ్ రైల్ కారిడార్లు, కొబ్బరి రైతుల కోసం పథకం, అరకు వ్యాలీలో మౌంటెన్ ట్రైన్లు వంటివి ప్రకటించింది. కేంద్ర బడ్జెట్తో ఏపీకి మేలు మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్తో ఏపీకి మేలు జరుగుతుందని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ఏపీకి గణనీయమైన మేలు జరగనుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. హై స్పీడ్ రైల్ కారిడార్లు, క్రిటికల్ మినరల్స్ కారిడార్,. డేటా సెంటర్లకు ట్యాక్స్ ప్రోత్సాహకాలు వంటి నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం, పర్యాటక రంగానికి సంబంధించి కూడా కీలక అంశాలు ఉన్నాయన్నారు. ఈ బడ్జెట్ ద్వారా పెట్టుబడులను వేగవంతం చేసి, రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తామంటూ ఏపీ మంత్రి నార ా లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.