మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్!

★ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?

సాక్షి డిజిటల్ న్యూస్ : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షులు అజిత్ పవార్ బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో ఎన్సీపీ కోటాలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? అనేది చర్చనీయాంశంగా మారింది.మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షులు అజిత్ పవార్ బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్సీపీ పగ్గాలు ఎవరు చేపట్టనున్నారు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పోస్టును ఎవరూ భర్తీ చేయనున్నారు?, ఎన్సీపీ - ఎన్సీపీ (శరద్ పవార్) వర్గాలు తిరిగి కలిసిపోతాయా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం... మహారాష్ట్రలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో బీజేపీ, ఎన్సీపీ, శివసేనలు కీలక పార్టీలుగా ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా... రెండు డిప్యూటీ సీఎం పోస్టులను ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (ఏక్‌నాథ్ షిండే)లకు కేటాయించారు. అయితే ఇప్పుడు అజిత్ పవార్ మరణంతో ఆ స్థానాన్ని ఎన్సీపీ నుంచి ఎవరు? భర్తీ చేయనున్నారనే చర్చ సాగుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... అజిత్ పవార్ సతీమణి, రాజ్యసభ సభ్యురాలు సునేత్ర పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలలో దాదాపు 90 శాతం మంది సునేత్ర పవార్‌ను తమ పార్టీ నాయకురాలిగా అంగీకరించారని... దీంతో ఆమె మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమం అయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దివంగత అజిత్ పవార్ నిర్వహించిన పార్టీ నాయకుడి పదవి, ప్రభుత్వంలో కీలక పోర్ట్‌ఫోలియోలతో సహా కీలక నాయకత్వ స్థానాలను ఖరారు చేయడానికి ఎన్సీపీ శాసనసభపక్ష సమావేశం శనివారం జరగనుంది. ఈ క్రమంలోనే బారామతికి వెళ్లిన ఎన్సీపీ సీనియర్ నేత సునీల్ తట్కరే... రేపు జరగబోయే కీలక శాసనసభాపక్ష సమావేశానికి ముందు ఈరోజు రాత్రి సునేత్ర పవార్, పవార్ కుటుంబంలోని ఇతర సభ్యులతో చర్చలు జరిపే అవకాశం ఉంది.