పయనించే సూర్యుడు న్యూస్ : కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి. ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి అనే దానిపైన ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళు వస్తువుల పైన కేంద్ర ప్రభుత్వం దిగుమతి శుంకాలను గనుక తగ్గించినట్లయితే ధరలు దిగివచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల భారతదేశం యూరోపియన్ యూనియన్ దేశాలతో ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకుంది ఈ నేపథ్యంలో పలు రంగాలకు సంబంధించిన దిగుమతుల కోసం సుంకాలను తగ్గించే వీలుంది. 2026 కేంద్ర బడ్జెట్ అత్యంత కీలకమైనది. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వాణిజ్య రంగాలు ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం బడ్జెట్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, దేశీయంగా ఎదురవుతున్న సవాళ్లు, అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ ముందు నిలబడిన సవాళ్లు, పెరుగుతున్న ధరలు. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి. ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి అనే దానిపైన ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళు వస్తువుల పైన కేంద్ర ప్రభుత్వం దిగుమతి శుంకాలను గనుక తగ్గించినట్లయితే ధరలు దిగివచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల భారతదేశం యూరోపియన్ యూనియన్ దేశాలతో ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకుంది ఈ నేపథ్యంలో పలు రంగాలకు సంబంధించిన దిగుమతుల కోసం సుంకాలను తగ్గించే వీలుంది. ఈ వస్తువుల ధరలు తగ్గవచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు: ఎలక్ట్రానిక్ వస్తువుల పైన భారత ప్రభుత్వం ఈసారి దిగుమతి సుంకాలను తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఫోన్లు, లాప్ టాప్స్, అలాగే ట్యాబ్స్ విషయంలో మార్కెట్లో ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. విద్యుత్ వాహనాల ధరలు తగ్గే అవకాశం పర్యావరణ కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వాహనాల పైన సబ్సిడీలను పెంచే అవకాశం కనిపిస్తోంది. వాహనాల ధరలు తగ్గే వీలుంది. గృహ రుణాల పైన వడ్డీ తగ్గే ఛాన్స్ ఇప్పటికే తగ్గించిన నేపథ్యంలో గృహ రుణాల పైన వడ్డీ భారీగా తగ్గింది. అయితే తాజాగా దీనిపైన కేంద్ర ప్రభుత్వం అఫర్డబుల్ హౌసింగ్ విషయంలో కీలక నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే గృహ రుణాల పైన వడ్డీ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. బంగారం దిగుమతి సుంకాల తగ్గింపు ప్రకటించే ఛాన్స్ గతంలోనే 15% ఉన్నటువంటి దిగుమతి సుంకాన్ని ఆరు శాతానికి తగ్గించారు. ప్రస్తుతం బంగారం ధర భారీగా పెరిగిన రేపధ్యంలో ఈ సుంకాలను మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈ ధరలు పెరిగే అవకాశం విలాసవంతమైన వస్తువులు, పెట్రోల్ డీజిల్ ధరలు, పొగాకు సంబంధిత ఉత్పత్తులు, అలాగే బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ ల పైన పెంచే అవకాశం ఉంటుంది. దీంతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కొన్ని స్పెషాలిటీ రసాయనాలు, అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులపైన సుంకాలు పెరిగే అవకాశం ఉంటుంది.