కేసీఆర్ రిక్వెస్ట్‌ను తిరస్కరించిన సిట్

* ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు-కేసీఆర్ విజ్ఞప్తి రద్దు

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ అధికారులు షాక్ ఇచ్చారు. ఫామ్ హౌస్‌లో విచారించాలన్న విజ్ఞప్తిని తిరస్కరించారు. నందినగర్‌లోని నివాసంలోనే విచారిస్తామని అందుకు సహకరించాలని సిట్ కోరింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రిక్వస్ట్‌ను సిట్ అధికారులు తిరస్కరించారు. రెండోసారి నోటీసులు శుక్రవారం జారీ చేశారు. అయితే ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో మధ్యాహ్నాం 3 గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా సిట్ నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో విచారించాలన్న కేసీఆర్ రిక్వస్ట్‌ను సిట్ తిరస్కరించింది. అంతేకాదు ఇకపై ప్రతీ నోటీసులు కూడా ఫామ్ హౌజ్‌కే పంపించాలన్న రిక్వస్ట్‌ను సైతం సిట్ తిరస్కరించింది. అయితే కేసీఆర్ రిక్వస్ట్‌ను సిట్ దర్యాప్తు సంస్థ తిరస్కరించడంతో బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. కేసీఆర్ రిక్వస్ట్‌ను తిరస్కరించిన సిట్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగవంతం అయ్యింది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలతోపాటు ఇతర అధికారులను సైతం విచారించిన సంగతి తెలిసిందే. ఇటీవలే కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నాం 3 గంటలకు విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఈ నోటీసులకు మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యుత్తరం పంపించారు. శుక్రవారం తాను విచారణకు హాజరుకాలేనని తెలిపారు.మున్సిపల్ ఎన్నికలు, నామినేషన్ల పర్వం కొనసాగున్న వేళ రేపటి విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు వేసేందుకు గడువు రేపు ఒక్కరోజే మాత్రమే ఉంది అని లేఖలో పేర్కొన్నారు.ఈ క్రమంలో తనకు కాస్త సమయం కావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్‌ను రిక్వస్ట్ చేశారు. అయితే కేసీఆర్ రిక్విస్ట్‌ను సిట్ తిరస్కరించింది. నందినగర్ నివాసంలోనే సిట్ విచారణ తాజాగా శుక్రవారం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని ఆ నోటీసులో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గతంలో నోటీసులు ఇచ్చిన సమయంలో కేసీఆర్ సిట్ ఎదుట ఉంచిన రిక్వస్ట్‌లను సిట్ రిజెక్ట్ చేసింది. మున్సిపల్ ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాతే విచారణకు వస్తానని…అలాగే విచారణను తన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో జరపాలని కేసీఆర్ సిట్‌ను కోరారు. అయితే ఈ రెండు రిక్వస్ట్‌లను సిట్ నిరాకరించింది. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో విచారణ సాధ్యం కాదని… నందినగర్ నివాసంలోనే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.ఇకపోతే గురువారం సిట్ ఇచ్చిన నోటీసుల్లో 65 ఏళ్ల వయసు దృష్ట్యా పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదు అని కేసీఆర్‌కు సిట్ సూచించింది. విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నగర పరిధిలోని ఏదైనా ప్రాంతం వివరాలను తెలపాలని సూచించింది. అక్కడకు వచ్చి విచారిస్తామని నోటీసుల్లో పేర్కొంది.అయితే కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌజ్‌లో విచారించాలని సిట్‌కు లేఖ రాశారు. అంతేకాదు ఇకపై నోటీసులన్నీ ఫామ్ హౌస్‌కు పంపాలన్న అభ్యర్థనను సైతం తిరస్కరించింది. ఈ క్రమంలోనే నందినగర్‌ నివాసంలో ఫిబ్రవరి 1న మధ్యాహ్నాం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. కేసీఆర్ సహకరించేనా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు అయిన కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావులను సిట్ విచారించిన సంగతి తెలిసిందే.వీరందరిని సుదీర్ఘంగా విచారించింది సిట్. వీరి వద్ద నుంచి సిట్ సమాచారం సేకరించింది. బీఆర్ఎస్ అగ్రనేతలు, ఇతర అధికారులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్‌ను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ రిక్వస్ట్‌ను సిట్ తిరస్కరించడంతో ఆయన ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. సిట్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1న సిట్ విచారణకు హాజరవుతారా? లేక మరోసారి గడువు కోరుతారా?లీగల్ ఒపీనియన్ ప్రకారం నడుచుకుంటారా?అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశాలపై ఆరా తీసే ఛాన్స్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో అధికారులు, ప్రజాప్రతినిధులకు సిట్ వరుస నోటీసులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ,అధికారులకు సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ విచారణలో భాగంగా సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో ఆధారాలను సేకరించడంతో కేసీఆర్‌ను విచారించి పలు అంశాలపై క్లారిటీ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సీపీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం నోటీసులు జారీ చేసింది. ఈమేరకు మాజీ సీఎం కేసీఆర్‌కు 160 CRPC కింద నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల సమయంలో అధికారంలో ఉన్న కీలక వ్యక్తులకు, ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాల గురించి కేసీఆర్‌ను ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌కు సిట్ బృందం నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *