పరవాడ పారిశ్రామికవాడలో క్యాన్సర్ కలకలం…

★తాడి గ్రామంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన

సాక్షి డిజిటల్ న్యూస్: కాలుష్యాన్ని నివారించలేం… నియంత్రించవచ్చు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ‘ఉత్తరాంధ్ర తీర ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతే వేగంగా ఇక్కడ గాలి నాణ్యత తగ్గుతూ వచ్చింది. గడచిన రెండేళ్ల కాలంలో పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ పరవాడ పారిశ్రామికవాడ పరిధిలోని తాడి గ్రామం లాంటి చోట్ల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ‘కాలుష్యం మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారిపోయింది. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కొంత వరకు కాలుష్యాన్ని భరించక తప్పని పరిస్థితి. అయితే కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో నివారించలేకపోయినా నిలువరించి నియంత్రించే ప్రయత్నం అయితే జరగాలి. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి’అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తు.చ. తప్పక పాటిస్తూ జీవ వైవిధ్యానికి సహకరించాలని సూచించారు. నూతన సాంకేతికత సాయంతో వ్యర్థాల నిర్వహణ, గాలి నాణ్యత పెంపు తదితర చర్యలు తీసుకోవాలని తెలిపారు. విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్‌లో శుక్రవారం సాయంత్రం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణం, కాలుష్య నియంత్రణ అంశంపై విశాఖ పరిసరాల్లోని పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. పోర్టు నుంచి పారిశ్రామికవాడల వరకు యాజమాన్యాలు కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. తాడిగ్రామంలో ఇంటికొకరు చొప్పున క్యాన్సర్ పేషెంట్స్ ‘ఉత్తరాంధ్ర తీర ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతే వేగంగా ఇక్కడ గాలి నాణ్యత తగ్గుతూ వచ్చింది. గడచిన రెండేళ్ల కాలంలో పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ పరవాడ పారిశ్రామికవాడ పరిధిలోని తాడి గ్రామం లాంటి చోట్ల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.‘రసాయన పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం కారణంగా తాడి గ్రామంలో ఇంటికొకరు చొప్పున క్యాన్సర్ బారిన పడిన దుస్థితి. చిన్నారుల్లో చర్మ వ్యాధులు, మహిళల్లో గర్భస్రావాలు, ఊపిరితిత్తుల వ్యాధులు ఆ ప్రాంతంలో సర్వసాధారణం అయిపోయాయి. అలాగే విశాఖ పోర్టు కాలుష్యం కూడా పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యంపై దాడి చేస్తోంది. పోర్టు పరిసరాల్లో బొగ్గు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పోర్టు అథారిటీ పరిధిలోని గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. అక్కడ నివశించే ప్రజలు ఎన్నో సందర్భాల్లో వారి సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి ఘటనలపై మానవతా దృక్పథంతో స్పందించి బాధిత ప్రజలకు అండగా నిలవాలి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు.