
సాక్షి డిజిటల్ న్యూస్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం అందించబోతున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కామన్ స్కూల్ ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబంగా ఎదుగుతుంది అని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం అందించబోతున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కామన్ స్కూల్ ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబంగా ఎదుగుతుంది అని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం అందించబోతున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కామన్ స్కూల్ ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబంగా ఎదుగుతుంది అని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. మహిళలను మహాలక్ష్మిలుగా గౌరవిస్తున్నాం గత పాలకులు ఐఐటీలను అనాధలుగా వదిలేస్తే మారిన కాలానికి అనుగుణంగా వాటిలో శిక్షణ ఇవ్వాలని, ఆధునిక యంత్ర పరికరాలను తీసుకువచ్చి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పారిశ్రామికవేత్తలను తీసుకువచ్చి ఉపాధి పొందేందుకు అవసరమైన సిలబస్ను రూపొందించామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఐటిఐ లను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 15 రోజుల వ్యవధిలోనే అధికారులతో నివేదిక తెప్పించుకొని డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ఆధునిక ఆసుపత్రుల నిర్మాణం జరుగుతుంది, జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికరించామని వివరించారు. రాష్ట్రంలోని మహిళలందరికీ నాణ్యమైన చీరలు ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి పంపిణీ చేస్తున్నాం వారిని మహాలక్ష్మి లుగా గౌరవిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మహిళలకు రూ.20వేల కోట్ల వడ్డీ లేని రుణా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దెందుకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నాం మొదటి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామంటే అంతా నవ్వారు కానీ మేం పట్టుదలతో మొదటి ఏడాది 26 వేల కోట్ల వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను మహిళా సంఘాలకు పంపిణీ చేసి ఇది సాధ్యమని నిరూపించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వివరించారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు ఈ తరానికి తెలిసి ఉండకపోవచ్చు ఈ దేశంలో భూ సంస్కరణలకు ఆధ్యుడు బూర్గుల రామకృష్ణారావు అని వివరించారు. దివంగత ముఖ్యమంత్రులు బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి తో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ సత్యనారాయణ రెడ్డి, ప్రముఖ ప్రొఫెసర్ హ రగోపాల్ వంటి అనేకమంది ప్రముఖులను మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల దేశానికి సమాజానికి అందించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం రాజు దైవంశ సంభూతుడు అన్న భావన ఒకవైపు, భూమికోసం భుక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం మరోవైపు కొనసాగుతున్న రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాలు నడిపించి నిజాం వ్యతిరేక పోరాటం చేసిన గొప్ప నాయకుడు బూర్గుల రామకృష్ణారావు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బూర్గుల మొదట న్యాయవాద వృత్తిని చేపట్టిన తన జీవితం ప్రజల కోసం ఉపయోగపడాలని రాజకీయాల్లోకి వచ్చారని డిప్యూటీ సీఎం తెలిపారు.హైదరాబాద్ ముఖ్యమంత్రిగా 1950- 54 మధ్యకాలంలో కౌలు గారి చట్టం తీసుకువచ్చి సాగు చేసుకునే వారికి భూమిపై హక్కులు కల్పించి దేశంలో భూసంస్కరణలకు బూర్గుల ఆధ్వర్యంలో నిలిచారని తెలిపారు. జాగిరి దారి వ్యవస్థ, వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించారని తెలిపారు. దేశంలో 1970లో తీసుకువచ్చిన భూ సంస్కరణల చట్టానికి బూర్గుల బాధ్యుడిగా నిలిచారని తెలిపారు. సాయుధ పోరాటం వంటి సమస్యలకు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కారం చూపిన మహానేత బూర్గుల అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వివరించారు.