జనం న్యూస్: అక్రమ మద్యం కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం ఉదయం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కుమారులతో కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆందోళన చెందవద్దని తప్పుడు కేసులపైపోరాడుదాం అని భరోసా ఇచ్చారు. అక్రమ మద్యంకేసులో జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. జైలు నుంచి గురువారం విడుదలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్ జగన్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, తన కుమారులను, కుటుంబ సభ్యులను కేసులతో వేధిస్తున్న తీరును వైఎస్ జగన్‌కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.ప్రజల పక్షాన, ప్రజల తరుపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు, క్యాడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు.ఇకపోతే మద్యం కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది జూన్ 17వ తేదీన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్ భాస్కర్ రెడ్డిని బెంగళూరులో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 226 రోజుల పాటు చెవిరెడ్డి జైలు జీవితాన్ని గడిపారు. అప్పటి నుంచి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ రెగ్యులర్ బెయిల్ రాలేదు. తాజాగా హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదల అయ్యారు. జైలు నుంచి విడుదలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది.అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితోపాటు ఇదే కేసులో జైలులో ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడులకు కూడా బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా పాస్ పోర్టులను కోర్టుకు అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని, విచారణకు సహకరించాలంటూ హైకోర్టు షరతులు విధించింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం సాయంత్రం విజయవాడ సబ్ జైలు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదల అయ్యారు. జైలు నుంచి విడుదలైన సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్లకార్డులతో స్వాగతం పలికారు. ధర్మం గెలిచింది అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జైలు బయట చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, జోగి రమేశ్‌తోపాటు పలువురు కలి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డిని భుజాలపై ఎత్తుకుని ధర్మం గెలిచిందంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు. చంద్రబాబు సీఎం అయితే నేను జైలుకే