జనం న్యూస్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సిట్ అధికారులు నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. జనవరి 30న అనగా శుక్రవారం మధ్యాహ్నాం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది.ఇటీవలే ఇదే కేసులో మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను సిట్ విచారించింది. మరోవైపు రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావును కూడా సిట్ విచారించింది. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది.65 ఏళ్ల వయసు కావడంతో ఎక్కడ విచారణకు హాజరుకావాల్సింది అనేది కేసీఆర్ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది అని నోటీసుల్లో పేర్కొంది. 1973 సెక్షన్ 160 క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం వయోభారంతో ఉన్నవారు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదు అని తెలిపింది. కేసీఆర్‌కు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడకు వచ్చి సిట్ బృందం విచారిస్తుంది అని సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఈ అంశాలపై ఆరా తీసే ఛాన్స్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో అధికారులు, ప్రజాప్రతినిధులకు సిట్ వరుస నోటీసులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, అధికారులకు సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది.