
జనం న్యూస్: కర్నూలు జిల్లాలో విద్యుత్ స్తంభం కూలిన ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. విద్యుత్ స్తంభం కూలి, వైర్లు తెగిపడగా అటుగా వెళ్తున్న బాలుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. కర్నూలు జిల్లాలో విద్యుత్ స్తంభం కూలిన ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. విద్యుత్ స్తంభం కూలి, వైర్లు తెగిపడగా... అటుగా వెళ్తున్న బాలుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడికి సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇక, ఈ ప్రమాదంపై కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి తీవ్రంగా స్పందించారు. కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్య తీసుకోవాలని ఆదేశించారు. కాంట్రాక్టర్, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అదనపు కమిషనర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్‌పై టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. అంతేకాకుండా, సంబంధిత కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడానికి ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను కలెక్టర్ సిరి ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఇంజనీర్, వార్డ్ సౌకర్యాల కార్యదర్శిపై అభియోగాలు మోపాలని కూడా కలెక్టర్ సిరి ఆదేశాలు జారీ చేశారు. అసలేం జరిగిందంటే. కర్నూలులని అశోక్‌నగర్ ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు డ్రైనేజీ పనులు చేపట్టారు. మురుగు కాలువల మరమ్మతుల కోసం గోతులు తీశారు. ఈ సమయంలోనే అక్కడున్న ఓ విద్యుత్ స్తంభం బేస్ చెదిరిపోయింది. మంగళవారం ఉదయం ఓ బాలుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో విద్యుత్ స్తంభం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే కొన్ని సెకన్ల ముందే ఏదో తేడాగా ఉందని గమనించిన బాలుడు వెనక్కి పరుగులు తీశాడు. ఆ తర్వాత క్షణాల్లో విద్యుత్ స్తంభం నెలకొరిగింది. విద్యుత్ సరఫరాతో కూడిన తీగలు కింద పడిపోయాయి. అయితే అక్కడి నుంచి వెనక్కి పరుగులు తీయడం ద్వారా బాలుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీకెమెరాల్లో నమోదయ్యాయి. అశోక్‌నగర్‌లో మురుగు కాలువల మరమ్మతుల కోసం గోతులు తీయగా స్తంభం బలహీనపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ట్రాన్స్‌కో అధికారుల ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించినట్లు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి విశ్వనాథ్ తెలిపారు. పనులను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ ఇద్దరు మున్సిపల్ అధికారులకు షో-కాజ్ నోటీసులు జారీ చేశారు.