అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనపై కీలక సీసీటీవీ ఫుటేజ్

జనం న్యూస్: మహారాష్ట్రలోని బారామతిలో బుధవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో సహా ఐదుగురు మరణించారు. మహారాష్ట్రలోని బారామతిలో బుధవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో సహా ఐదుగురు మరణించారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తీరు ప్రమాద స్థలానికి సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సమీపంలోని సిసిటివి కెమెరాలో ప్రమాదం రికార్డైంది, విమానం ఒక చిన్న దుకాణం వెనుక నేలపై కూలిపోతున్నట్లు కనిపించింది. ఆ తర్వాత కొన్ని సెకన్లకు పెద్ద ఎత్తున మంట, పొగ వెలువడింది. సరిగ్గా ఉదయం 8.46 గంటలకు విమానం క్రాష్ అయినట్టుగా ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలుస్తోంది. ఇక, అజిత్ పవార్ రాబోయే జిల్లా పరిషత్ నేపథ్యంలో ప్రచార సభలకు హాజరు కావడానికి బారామతికి వెళుతున్నారు. బారామతి విమానాశ్రయంలో చార్టర్డ్ విమానం రెండోసారి అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన భద్రతా సిబ్బంది ఇద్దరు(ఒక పీఎస్‌వో, ఒక అటెండెంట్), ఇద్దరు పైలట్లు (సుమిత్ కపూర్, సంభవి పాఠక్), కూడా మరణించారు. ఈ విషయాన్ని డీజీసీఏ ధ్రువీకరించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం విమానంలో ఉన్న ఏ ఒక్కరూ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడలేదని తెలిపింది. ఇక, ప్రమాదానికి గురైన చార్టర్ విమానం. బొంబార్డియర్ లియర్‌జెట్ 45 కాగా, ఇది 16 ఏళ్ల సర్వీసును కలిగి ఉంది. ఈ విమానం ఢిల్లీకి చెందిన చార్టర్ కంపెనీ వీఎస్సార్‌కు చెందినది. ప్రమాదం తర్వాత ఘటన స్థలం పూర్తిగా బూడిదగా మారింది. విమానం పూర్తిగా ముక్కలైపోయి, శిథిలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.