అజిత్ పవార్ విమానం కూలిపోవడానికి కారణాలివేనా? నిపుణుల కీలక వెల్లడి

పయనించే సూర్యుడు న్యూస్ : విమానయాన నిపుణుల అభిప్రాయం ప్రకారం,బ్యాడ్ వాతావరణం ఒక్కటే విమాన ప్రమాదానికి కారణం కాదు. అనేక విషయాలు కారణమవుతాయి. అయితే. మహారాష్ట్రలోని బారామతి ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తోపాటు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పవార్ VT-SSK రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న చార్టర్ విమానంలో బారామతిలో జరిగే బహిరంగ సభలో పాల్గొనడానికి వెళ్తున్నారు. అయితే ఆ సమయంలో వాతావరణం ఏ మాత్రం బాగా లేదని తెలుస్తుంది. అదే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో అసలు ఈ సమయంలో విమానం కూలిపోవడానికి ఏ అంశాలు కారణమై ఉంటాయనే ప్రశ్నలు తలెత్తున్నాయి. విమానయాన నిపుణుల అభిప్రాయం ప్రకారం,బ్యాడ్ వాతావరణం ఒక్కటే విమాన ప్రమాదానికి కారణం కాదు. అనేక విషయాలు కారణమవుతాయి. అయితే, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ (AAIB) దర్యాప్తు తర్వాతే ప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుంది. ప్రస్తుతం DGCA, AAIB బృందాలు విమానం బ్లాక్ బాక్స్‌‌ను సేకరించి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే పనిలో ఉన్నాయి. ఆ తర్వాత మనకి కచ్చితమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. 1. ఏం కనిపించకుండా ఉండడం: దట్టమైన పొగమంచు, భారీ వర్షం లేదా దట్టమైన మేఘాల కవచం రన్‌వే, పర్వతాలు లేదా చుట్టుపక్కల అడ్డంకులను పైలట్ స్పష్టంగా చూడకుండా చేస్తాయి. ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిగా ఉంటుంది. 2. గాలి ప్రభావం: ఇది చాలా ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితి. గాలి దిశ, వేగం సెకన్లలోనే మారవచ్చు. దీని వలన విమానం అకస్మాత్తుగా పట్టుకోల్పోతుంది. ల్యాండింగ్ సమయంలో ప్రమాదాలకు ఇది ప్రధాన ప్రమాద కారణం అయ్యే ఛాన్స్ పక్కాగా ఉంది. 3. అల్లకల్లోలం: క్యుములోనింబస్ అంటే భారీ బలమైన గాలులు ఆకాశంలో వస్తే వాటి ప్రభావం ఈ చిన్న విమానాలపై ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా విమాన నియంత్రణ కష్టతరం అవుతుంది. 4. మెరుపుల ప్రభావం: ఆధునిక విమానాలు మెరుపులను అడ్డుకునే సాంకేతికత ఉంది. అయితే కొన్నిసార్లు అవి ఎలక్ట్రానిక్ వ్యవస్థలు లేదా సెన్సార్లను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల విమానాలు కూలిపోయే అవకాశం ఉంది. కానీ, ప్రమాదం అలా అనిపించడం లేదు. ఇంజిన్ ఐసింగ్: విమానం ఉదయం పూట.. అతి కూడా శీతాకాలంలో ప్రయాణిస్తుంటే చల్లని తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. ఈ పరిస్థితి రెక్కలు లేదా ఇంజిన్లపై మంచు ఏర్పడవచ్చు. ఇది విమాన లిఫ్ట్‌ను తగ్గిస్తుంది. ఇంజిన్ పవర్‌ను ప్రభావితం చేస్తుంది. అయితే ఈ ప్రమాదం ల్యాండింగ్ సమయంలో జరిగినందున, ఇంజిన్ ఐసింగ్ సంభవించే అవకాశం లేదు. పైలట్ దిక్కుతోచని స్థితి: దట్టమైన మేఘాలు లేదా చీకటిలో పైలట్లు ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిని ఎదుర్కుంటారు. అలాంటి సమయంలో చేసిన ఓ చిన్న తప్పు నియంత్రణ ఇన్‌పుట్‌లకు దారితీయవచ్చు. నావిగేషన్/ఇన్స్ట్రుమెంట్ వైఫల్యం: భారీ వర్షం లేదా తుఫానులు రాడార్, పిటాట్ ట్యూబ్‌లు (స్పీడ్ సెన్సార్లు) లేదా ఇతర పరికరాలకు అంతరాయం కలిగించవచ్చు. ఈ కారకాలు విమానం కూలిపోవడానికి కూడా కారణమవుతాయి.