అజిత్ పవార్ అంత్యక్రియలు అక్కడే నిర్వహణ

★అధికారికంగా వెల్లడించిన వివరాలు

సాక్షి డిజిటల్ న్యూస్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం (జనవరి 29) రోజున నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం (జనవరి 29) రోజున నిర్వహించనున్నారు. అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించబడతాయని మహారాష్ట్ర జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం (ప్రోటోకాల్) బుధవారం తెలిపింది. అయితే అజిత్ పవార్ అంత్యక్రియలు బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్‌ మైదానంలో జరగనున్నాయి. ఈ మేరకు విద్యా ప్రతిష్ఠాన్ ట్రస్టీ కిరణ్ వివరాలు వెల్లడించారు. కిరణ్ ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ... అజిత్ పవార్ అంత్యక్రియలు రేపు ఉదయం 11 గంటలకు జరుగుతాయని తెలిపారు. ‘‘అజిత్ పవార్ భౌతికకాయాన్ని ప్రజలు చివరి నివాళులర్పించడానికి ఈరోజు విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ఉంచుతారు. అంత్యక్రియలు రేపు ఉదయం 11 గంటలకు జరుగుతాయి’’ అని కిరణ్ చెప్పారు. అజిత్ పవార్ అంత్యక్రియలకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌లు హాజరయ్యే అవకాశం ఉంది. అజిత్ పవార్ అంత్యక్రియలకు పలువురు కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు మంత్రులు, పలువురు రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. ఇక, అజిత్ పవార్ బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతికి చార్టర్ విమానంలో బయలుదేరారు. అయితే పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ఉదయం 8.46 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. బారామతి విమానాశ్రయంలో చార్టర్డ్ విమానం రెండోసారి అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బారామతిలోని రన్ వేకు 100 మీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.