రేవంత్ రెడ్డిపై కవిత ఆరోపణలు:

★ సంతోష్ రావు ప్రధాన గూఢచారి అంటూ వ్యాఖ్యలు.

జనం న్యూస్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉద్యమకారులకు, పేద ప్రజలకు, అమరవీరుల కుటుంబాలకు దూరమయ్యారంటే ప్రధాన కారణం మాజీ ఎంపీ సంతోష్ రావు అని ఆరోపించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉద్యమకారులకు, పేద ప్రజలకు, అమరవీరుల కుటుంబాలకు దూరమయ్యారంటే ప్రధాన కారణం మాజీ ఎంపీ సంతోష్ రావు అని ఆరోపించారు. గద్దర్ లాంటి వాళ్లు ప్రగతి భవన్ గేటు బయట వేచి ఉండాల్సి వచ్చిందంటే, ఈటల రాజేందర్ బీఆర్ఎస్‌ను వీడాల్సి వచ్చిందంటే. ఈ అన్ని దుర్మార్గాలకు సెంటర్ పాయింట్ సంతోష్ రావు అని సంచలన కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి సంతోష్‌రావు గూఢచారి అని సంచలన ఆరోపణలు చేశారు. గంజాయి స్మగర్ల దాడిలో గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్యను కవిత మంగళవారం పరామర్శించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడంపై కవిత స్పందించారు. ‘‘సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ సగం ఇడ్లీ తిన్నారా? ఫుల్ ఇడ్లీ తిన్నారా? అనేది కూడా ముఖ్యమంత్రికి చేరవేస్తారు. రేవంత్ రెడ్డి ఆయన గూఢచారి సంతోష్‌రావుకు శిక్ష విధిస్తారా? లేదా? అనేది వేచిచూడాల్సి ఉంది. సిట్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది చూడాలి. అటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు, కేటీఆర్‌ ఎందుకు వత్తాసు పలుకుతున్నారనేది బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచించుకోవాలి. పార్టీలో అనేక మంది నాయకులకు రక్తపు కన్నీరు తెప్పించింది సంతోష్ రావు. నేను చెబుతున్న దెయ్యాలలో మొదటి దెయ్యం సంతోష్ రావు. రేవంత్ రెడ్డి. ఆయన గూఢచారిని కాపాడుకుంటారనే భయం నాకు ఉంది. కానీ పోలీసులు రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలి’’ అని కవిత పేర్కొన్నారు. ఇక, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్‌లకు వేర్వేరుగా నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు వారిని విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం (జనవరి 27) మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సంతోష్‌ రావుకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తనకు నోటీసులు జారీ చేసిన నోటీసులపై సంతోష్ రావు స్పందిస్తూ. తాను సిట్ విచారణకు హాజరవుతానని తెలిపారు. సిట్ ప్రశ్నలకు సమాధానం చెబుతానని చెప్పారు.