కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్

జనం న్యూస్: ‘మున్సిపల్ ఎన్నికలను సెమీఫైనల్స్ అంటున్న మాజీ ముఖ్యమంత్రి కొడుకు, మాజీ మంత్రి కేటీఆర్‌కి వ్యక్తిగతంగా నా సవాల్, కాంగ్రెస్ పార్టీ తరపున రెఫరెండంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. దమ్ముంటే స్వీకరించాలి.’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంటోంది.అధికార ప్రతిపక్ష పార్టీలు మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో పోటీపడి ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. 2024 పార్లమెంట్ ఎన్నిక ల్లో డకౌట్ అయిన బీఆర్ఎస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోష్ నెలకొంది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతుంది. అటు కాంగ్రెస్ పార్టీ సైతం అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విరుచుకుపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో పగటి కలలు కంటూ సెమీ ఫైనల్స్ అంటూ ఆటాడుతున్నారు. మళ్లీ ఈసారి కూడా భంగపాటు తప్పదు అని హెచ్చరించారు. కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు.మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని లక్ష్యంతో కేటీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఇన్‌చార్జిలను సైతం నియమించిన సంగతి తెలిసిందే. మున్సిపల్ ఎన్నికలు సెమీఫైనల్స్ అంటూ కేటీఆర్ భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.‘కేటీఆర్‌కి వ్యక్తిగతంగా నా సవాల్..దమ్ముంటే స్వీకరించాలి. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలను సెమీఫైనల్స్ అంటున్న మాజీ ముఖ్యమంత్రి కొడుకు, మాజీ మంత్రి కేటీఆర్‌కి వ్యక్తిగతంగా నా సవాల్, కాంగ్రెస్ పార్టీ తరపున రెఫరెండంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. దమ్ముంటే స్వీకరించాలి.’అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.‘సెమీఫైనల్స్, రెఫరెండం అంటేనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారు, ఐనా బుద్ధిరాలేదు. ఇంకా పగటి కలలు కంటూ సెమీ ఫైనల్స్ అంటూ ఆటాడుతున్నారు. మళ్ళీ ఈసారి కూడా భంగపాటు తప్పదు వారికి.’అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ దోచుకుందే తప్ప రాష్ట్రాన్ని చేసిందేమీ లేదు. ‘ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని పదెండ్లు దోచుకున్నారే తప్పా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. కమిషన్లతో కూడగట్టిన సొమ్ముతో విదేశాల్లో ఆస్తులు కొన్నారు కానీ పేదలకు చేసిందేమి లేదు.’అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.‘ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రజా ప్రభుత్వాన్ని కూలగొడతాం... అగ్నిగుండం చేస్తాం అనే అహంకారపు మాటలు, ఎన్నికలు వచ్చినప్పుడు పిట్ట కథలు చెప్పడం వారికి అలవాటుగా మారింది. బీఆర్ఎస్ నేతల చిత్తశుద్ధి, నిజాయితీ ఏంటి అన్నది పేదల ఇండ్లు ఇచ్చే విషయంలోనే తెలిసింది.’అని ఎద్దేవా చేశారు.‘గడిచిన రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనలో చెప్పిన మాటలు ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా చేసుకుంటూ పోతున్నాం. తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, సబ్బండ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. భూపాలపల్లి నియోజకవర్గానికి ఇదువరకే కేటియించిన 3500 ఇండ్లతో పాటు అదనంగా మరో మూడు విడతలు 500 అదనంగా మంజూరు చేస్తాం. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ అభ్యర్థులను మనస్ఫూర్తిగా దీవించి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి.’అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.