కూటమి పాలనపై బొత్స ఫైర్‌

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. యని ఆరోపించారు. ఈ పరిణామాలతో ప్రజలు విసిగిపోయారని. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై అలుపెరుగుని పోరాటం చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రజలంతా అండగా నిలబడుతున్నారని అన్నారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో కూటమి నాయకులు 20 నెలలుగా సాగుతున్న వేధింపులు పరాకాష్టకు చేరుకున్నాయని బొత్స విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని బలహీనపరిచారని. చట్టాలను ఉల్లంఘిస్తూ, పౌరుల హక్కులను కాలరాస్తూ, మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ ఆటవిక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత స్వార్థం, ప్రతిపక్షాలపై ద్వేషం, అధికారం ఉందనే అహంకారం, ఎల్లప్పుడూ తామే పదవుల్లో ఉండాలన్న ఆశతో కూటమి నాయకులు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందని బొత్స సత్యనారాయణ విమర్వించారు. కొంతమంది పోలీసు అధికారులు తప్పుడు కేసులతో అమాయక పౌరులను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో వైసీపీ పేదలు, సమాజంలోని అన్ని వర్గాల కోసం పోరాడుతూనే ఉందని చెప్పారు. గత ఐదేళ్ల వైఎస్ జగన్ రాష్ట్రంలో కొత్త చరిత్ర సృష్టించిందని బొత్స అన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని చెప్పారు. అనుభవశాలిని, విజనరీనని చెప్పుకునే చంద్రబాబు. నాటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాల్సింది పోయి వ్యవస్థలు విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఈ ఆటవిక పాలనకు అంతం పలకాలని. వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరూ సంఘటితమై, మరింతత ఉత్సాహంగా పని చేయాలని బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *