మున్సిపల్ ఎన్నికలను అవకాశంగా మలచుకోవాలి

* కాంగ్రెస్‌పై కేటీఆర్ సూచనలు.

జనం న్యూస్: బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా సోమవారం చేవెళ్ల నియోజకవర్గం మాజీ ఎంపీపీ విజయ్ భాస్కర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అనేక అబద్ధాలు, అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పక్కన పెట్టారు..పరిపాలన వదిలేశారు అని మండిపడ్డారు.‘కాంగ్రెస్ పార్టీ వాళ్లు హామీలు ఇచ్చి మోసం చేస్తారని మేము ఆ రోజే చెప్పాం. రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలలో ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా అందరినీ మోసం చేశారు.’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో సోమవారం చేవెళ్ల నియోజకవర్గం మాజీ ఎంపీపీ విజయ్ భాస్కర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. భారత రాష్ట్ర సమితిలో చేరారు. వారందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… వృద్ధుల నుంచి మొదలుకొని ఆడబిడ్డల వరకు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఇలా అందరినీ రేవంత్ రెడ్డి మోసం చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్న అన్ని వర్గాలు, ఈరోజు కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్నాయి అని చెప్పుకొచ్చారు. కాంగ్రెసోళ్లను గల్లాపట్టి నిలదీయండి మూడేళ్ల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేవెళ్లకు వచ్చి దళితబంధు కింద దళితులకు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నాడు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది… 12 లక్షలు కాదు కదా, 12 పైసలు కూడా ఇవ్వకుండా దళితులను మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ విమర్శించారు.అదే బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు కింద రూ.10 లక్షలు ఇచ్చింది అని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి మున్సిపల్ ఎన్నికలే మంచి అవకాశం.ఓట్లు అడగడానికి మీ ఇళ్లకు వచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టి, ఇచ్చిన హామీల మీద నిలదీయండి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *