భజన్ క్లబ్బింగ్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు

*గ్లోబల్ కాన్సెర్ట్‌లకు తీసిపోదన్న వ్యాఖ్య

సాక్షి డిజిటల్ న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘‘భజన్ క్లబ్బింగ్’’ అనే నూతన ధోరణిని ప్రశంసించారు. దీనిని “గ్లోబల్ కాన్సెర్ట్‌లకు (ప్రపంచ స్థాయి సంగీత కచేరీలకు) ఏమాత్రం తీసిపోనిది” అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘‘భజన్ క్లబ్బింగ్’’ అనే నూతన ధోరణిని ప్రశంసించారు. దీనిని “గ్లోబల్ కాన్సెర్ట్‌లకు (ప్రపంచ స్థాయి సంగీత కచేరీలకు) ఏమాత్రం తీసిపోనిది” అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ప్రధానమంత్రి మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారనే సంగతి తెలిసిందే. ఇందులో పలు అంశాలపై మోదీ తన అభిప్రాయాలను వెల్లడిస్తారు. తాజాగా జనవరి 25న మోదీ తన 130వ మన్‌ కీ బాత్ ఎపిసోడ్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భజన్ క్లబ్బింగ్ ట్రెండ్ గురించి ప్రస్తావించారు. దేశ యువ‌త‌లో మ‌న సంస్కృతి ప‌ట్ల అభిలాష పెరుగుతోంద‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. భజనలు, కీర్తనలు శతాబ్దాలుగా దేశ సంస్కృతికి ఆత్మగా నిలిచాయని, నేటి యువతరం భక్తిని తమ అనుభవాలలో ప్ర‌తిబింబిస్తున్నార‌ని తెలిపారు. ఇదే ఆలోచనతో ఒక కొత్త సాంస్కృతిక విధానం ప్రారంభ‌మైంద‌ని పేర్కొన్నారు. సామాజిక మాధ్య‌మాల‌లో ఇలాంటి వీడియోలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని.. సంగీతానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నార‌ని తెలిపారు. ఇందులో ఏ కచేరీకీ తీసిపోని వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని పేర్కొన్నారు. వీటిని భజన్ క్లబ్బింగ్ అంటున్నారని తెలిపారు. ఇది ముఖ్యంగా జెన్-జీ యువతలో వేగంగా జనరంజకంగా మారుతోందన్నారు. ‘‘నేటి యువత తమ దైనందిన అనుభవాలలో, జీవనశైలిలో భక్తి భావాన్ని జోడించారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలను చూస్తుంటే.. స్టేజ్ అలంకరణ, లైటింగ్, సంగీతం అచ్చం ఒక కాన్సెర్ట్‌ను తలపిస్తున్నాయి. కానీ అక్కడ పాడేది మాత్రం పూర్తి అంకితభావం, లయబద్ధమైన భజనలే” అని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమాల్లో భజనల గౌరవం, పవిత్రత ఎక్కడా తగ్గకుండా యువత జాగ్రత్తలు తీసుకోవడం సంతోషకరంగా ఉందని తెలిపారు. భక్తిని తేలికగా తీసుకోవడం లేదని ఆయన అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *