పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత బిల్లు ప్రవేశం

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే విషయంలో కేంద్రంపై ఏపీ ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలో అమరావతికి చటట్టబద్దత కల్పించే విషయంలో ఈ సెషన్లోనే బిల్లు పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. మరో నెల రోజుల వ్యవధిలోనే అమరావతికి చట్టబద్దత కల్పించే ఉంది. అమరావతికి రాజధాని హోదా కల్పించే ప్రక్రియ ఊపందుకుంది.ఈ మేరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా పావులు కదుపుతున్నాయి. అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్ర ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుుడు ఢిల్లీ పెద్దలతో చర్చస్తూ ఒత్తిడి పెంచుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే ప్రక్రియలో భాగంగా సవరణ బిల్లును ఈ పార్లమెంట్‌లో తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతికి చట్టబద్దత కల్పించే దిశగా కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ నిర్ణయానికి కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేయనుంది. పునర్విభజన చట్టాన్ని సవరించేది ఇలా! ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే పునర్విభజన చట్టం 2014ను సవరించాల్సి ఉంటుంది. తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్‌ను పొందుపరిచారే తప్ప ఏపీకి రాజధాని అమరావతి అని చూపలేదు. ఈ క్రమంలోనే ఏపీ పునర్విభజన చట్టం 2014ను సవరించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అమరావతి రాజధానిగా గెజిట్ ఇవ్వాల్సి ఉంటుంది. పునర్విభజన చట్టం పార్ట్-2 కింద 5(1) ప్రకారం నిర్ణయించిన తేదీ నుంచి పదేళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. పార్ట్ 2 కింద 5(2) సబ్ సెక్షన్ 5(1)లో పేర్కొన్న గడువు ముగిసన తర్వాత తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటు అవుతుంది. ఈ క్రమంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేస్తారు. పార్ట్ 2 5(2) సబ్ సెక్షన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏర్పాటవుతుంది అనే చోట అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని ఏర్పాటైందని పేర్కొంటారు. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత పార్లమెంట్‌కు సవరణ బిల్లు ఆమోదం తెలపాలి. అనంతరం గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. వీటన్నింటిపై ఫోకస్ పెట్టిన కేంద్రం శరవేగంగా అడుగులు వేస్తోంది. టీడీపీ హయాంలో అమరావతి పనుల్లో దూకుడు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. 2014లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమరావతిని రాజధానిగా గుర్తించి పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. . ఈ రాజధాని ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు 29 గ్రామాలకు చెందిన రైతులు ముందుకు వచ్చారు. రాజధాని కోసం త భూములను దాదాపుగా 34 వేల ఎకరాలు స్వచ్చంధంగా ప్రభుత్వానికి ఇచ్చారు. దీంతోనాటి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాజధాని పనులు చేపట్టింది. సింగపూర్ ప్రభుత్వం రూపొందిచిన మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు చేపట్టింది. అసెంబ్లీ, సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను సైతం నిర్మించింది. అంతేకాదు వాటిలోనే కార్యకలాపాలను సైతం చేపట్టింది. అలాగే రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల నిమిత్తం రహదారులు, విద్యుత్, తాగునీరు ఇతర వసతులను సైతం కల్పించింది. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ ఆఫీసులు సైతం నిర్మించింది. వైసీపీ ప్రకటనతో గందరగోళంగా రాజధాని అంశం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే వైసీపీ రాజధాని విషయంలో కొత్త వ్యూహాన్ని అమలు చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ప్రకటించింది. వైసీపీ అమరావతిని శాసన రాజధానిగా…కర్నూలును న్యాయరాజధానిగా…విశాఖపట్నంను పాలనా రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఏపీ రాజధాని ఏది అనేదానిపై స్పష్టత లేకుండా పోయింది. వైసీపీ నిర్ణయాన్ని అమరావతి రైతులతోపాటు పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.అమరావతి రైతులు అయితే పెద్ద ఎత్తున పోరాటం చేశారు. గల్లీ నుంచి ఢీల్లీ వరకు పోరాటం చేశారు. అయినప్పటికీ వైసీపీ వెనక్కి తగ్గలేదు. ఎన్డీఏ అధికారంలోకి రావడంతో చిగురించిన ఆశలు 2024 ఎన్నికల్లో అటు పార్లమెంట్ ఇటు ఏపీలో కూడా మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో సీఎం చంద్రబాబు నాయుడు కీలకం అయ్యారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే అంశంపై ఒత్తిడి పెంచారు.తాజాగా అమరావతికి సంబంధించి రెండో విడత ల్యాండ్ ఫూలింగ్ చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు రాజధానికి భూములు ఇచ్చిన రైతులు సైతం అమరావతికి చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోసీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి పెంచడంతో కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమైంది. అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. జనవరి 7న ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రామాలు, తాజా రాజకీయ పరిణామాలపై ఇరువుర చర్చించుకున్నారు. అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. దీని వల్ల రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగడంతో పాటు రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్టు అవుతుందని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు నాయుడు వివరించిన సంగతి తెలిసిందే.ఏపీకి అమరావతి గుండె అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండెలా పనిచేస్తోంది అని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి ప్రాంతం రాష్ట్రానికి మధ్యలో ఉంది. అమరావతి అంటే కేవలం ఒక చిన్న గ్రామం కాదు. విజయవాడ, గుంటూరు, గన్నవరం, మంగళగిరి ఇలా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కలిసి ఒక పెద్ద నగరంగా మారనుంది అని ప్రభుత్వం చెప్తోంది. రెండో దశ ల్యాండ్ ఫూలింగ్ ప్రక్రియ రెండో దశ ల్యాండ్ పూలింగ్ విధానంలో మొత్తం 7 గ్రామాల్లో భూసమీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో పల్నాడు జిల్లా అమరావతి మండలంలో వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో వడ్డమాను,హరిశ్చంద్రపురం,పెదపరిమి గ్రామాలు ఉన్నాయి. ఇప్పటివరకు 4 గ్రామాల్లో ప్రక్రియ ప్రారంభమైంది అని అధికార యంత్రాంగం తెలిపింది. ఈ భూములను అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా నగరం (ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ), స్మార్ట్ పరిశ్రమలు, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి పెద్ద ప్రాజెక్టుల కోసం ఉపయోగించనున్నట్టు పేర్కొంది.మొదటి దశలో 34,000 ఎకరాలు ఇప్పటికే పూల్ అయ్యాయని తాజాగా రెండో విడత ల్యాండ్ ఫూలింగ్‌తో అమరావతి ఒక మహానగరంగా విస్తరించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *