చరిత్రలో తొలి సారి అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు

★ ప్రత్యేక ఆకర్షణగా శకటాల ప్రదర్శన.

జనం న్యూస్: ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆవిష్కరించారు. అనంతరం పరేడ్‌లో పాల్గొన్న11 దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. శకటాల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భగా గవర్నర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. రాయపూడి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి హైకోర్టు వెళ్లే దారిలో 22 ఎకరాల విస్తీర్ణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ గణతంత్రదినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈవేడుకల్లో 22 అలంకృత శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వందేమాతరం, పది సూత్రాల మిషన్, అటవీ శాఖ, ఇరిగేషన్ శాఖ, పాఠశాల విద్య, వ్యవసాయ శాఖ, సీఆర్‌డీఏ తదితర విభాగాల శకటాలు ప్రజలను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో రూపొందించిన శకటాలను ప్రదర్శించారు. రిపబ్లిక్ వేడుకల్లో అమరావతి రైతులు అంతకుముందు గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్‌కు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తోపాటు సీఎస్,డీజీపీ ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు.ఈ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితోపాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా హాజరయ్యారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నతాధికారులు ఈ వేడుకలలో పాల్గొన్నారు.అలాగే ఈ వేడుకలకు అమరావతి రైతులు, స్థానికులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో జెండా ఆవిష్కరించిన సీఎస్. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా సోమవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధి మరియు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, సచివాలయ ముఖ్య భధ్రతాధికారి మల్లికార్జున రావు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ, పలువురు సచివాలయ అధికారులు పాల్గొన్నారు.