జనం న్యూస్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ఇందిరమ్మ చీరలు తీసుకుంటే రూ.1,200 చొప్పున అప్పు చేసినట్లేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఇందిరమ్మ చీరల విషయంలో ఆధార్, వేలిముద్ర సేకరించి మహిళల పేరు మీద అప్పు చేస్తున్నారని మాజీమంత్రి అన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమం ఇందిరమ్మ చీరల పంపిణీ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన బతుకమ్మ చీరల స్థానంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కొందరికి చీరలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు డ్వాక్రా సంఘాల మహిళలకు చీరలను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల ద్వారా ఈ పంపిణీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. అయితే ఈ పథకంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. వెనుక పెద్ద మోసం దాగి ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.1200 అప్పు రాస్తున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీపై మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.‘ప్రభుత్వం మీకు ఇచ్చే ఈ ఇందిరమ్మ చీరలు ఉచితం కావు. ఒక్కో చీర పేరుతో మీ పేరు మీద రూ. 1,200 అప్పు రాస్తున్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది.’అంటూ మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చీరల పంపిణీ సమయంలో మహిళల నుంచి ఆధార్ కార్డు వివరాలు సేకరించడం, వేలిముద్రలు తీసుకోవడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఇదేనని మాజీమంత్రి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆడంబరంగా చీరలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.. భవిష్యత్తులో మహిళలకు షాక్ ఇవ్వబోతుందని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. ఉచిత చీరలని చెప్పి డబ్బులు కట్టమని నోటీసులు పంపిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ఇందిరమ్మ చీరలు తీసుకుంటే రూ.1,200 చొప్పున అప్పు చేసినట్లేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఇందిరమ్మ చీరల విషయంలో ఆధార్, వేలిముద్ర సేకరించి మహిళల పేరు మీద అప్పు చేస్తున్నారని స్టేషన్ ఘన్‌పూర్‌లో వ్యాఖ్యానించారు. ఏదో రోజు డబ్బులు కట్టమని నోటీసులు పంపిస్తారంటూ బాంబు పేల్చారు.ఈ రోజు ఉచితమని చెప్పి చీరలు ఇస్తున్నారు కానీ, రేపు అదే మహిళలకు ఆ డబ్బులు కట్టమని నోటీసులు పంపిస్తారు. మీరు తీసుకున్న చీరలకు బాకీ పడ్డారని ఆ మొత్తాన్ని వసూలు చేసే ప్రమాదం ఉంది అంటూ మహిళలను మాజీమంత్రి హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎటువంటి డేటా సేకరణ లేకుండా చీరలు పంపిణీ చేయాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగరవేయాలి. త్వరలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగు వేళ స్టేషన్ ఘనపూర్ మాజీ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో నిర్వహించగా మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం అభివృద్ధిలో ముందు ఉందంటే దానికి కారణం కేసీఆర్ అని చెప్పుకొచ్చారు.స్టేషన్ ఘనపూర్ని మున్సిపాలిటీ చేసి అభివృద్ధి చేసిన మహానీయుడు కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలు కాలంలో ప్రజలకు చేసింది ఏమీ చేసింది లేదు. ప్రజలు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి బుద్ధి చెప్తాము అని బహిర్గతంగానే చర్చించుకుంటున్నారు. ఈ మున్సిపాలిటీలో ఉన్న 18 వార్డులకు 18 బిఆర్ఎస్ కైవసం చేసుకోవాలి. దానికి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి మున్సిపాలిటీ పై బిఆర్ఎస్ జెండా ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మరియు జిల్లా, మండలం, గ్రామ నాయకులు ఉన్నారు.