బొగ్గు స్కాంలో రేవంత్ రెడ్డి బామ్మర్ది పాత్రపై

★ హరీశ్ రావు ఆరోపణలు.

జనం న్యూస్: సైట్ విజిట్ అమలయ్యింది. నైనీ రద్దు జరిగింది అంటే.. స్కాం జరిగినట్లే కదా? అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా బీటింగ్ అరౌండ్ ద బుష్ లా ఏదో చెప్పి, మసిబూసి మారేడు కాయ చేశారు అని మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సింగరేణి బొగ్గు మరియు సోలార్ టెండర్ల వ్యవహారంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన ప్రెస్ మీట్‌పై మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని హరీశ్ రావు ఆరోపించారు. నైనీ టెండర్ రద్దు చేయడమే అవినీతికి నిదర్శనమని. అదే తరహాలో పిలిచిన మిగిలిన టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా బీటింగ్ అరౌండ్ ద బుష్ లా ఏదో చెప్పి, మసిబూసి మారేడు కాయ చేశారు అని మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఏ స్కాం జరగకుంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారు? డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీరెన్ని సాకులు చెప్పినా మీ కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజం అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. అందులో రేవంత్ రెడ్డి బామ్మర్ది రింగ్ మెన్‌గా పాత్ర పోషించింది నిజం అని చెప్పుకొచ్చారు. నేను సూటిగా అడుగుతున్నా.. ఏ స్కాం జరగకుంటే నైనీ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించారు? నిన్న నేను బయటపెట్టిన మరో కుంభకోణం.. సోలార్ పవర్ స్కాం గురించి ఎందుకు ఒక్క మాట కూడా నేటి ప్రెస్‌మీట్‌లో మాట్లాడలేదు? నైనీని రద్దు చేసినట్లే మిగతా అన్ని టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదు? అని ప్రశ్నించారు.సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను బీఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేయడం వల్ల నిజాలు అబద్దాలు అయిపోవు, జరిగిన స్కాంలు, స్కీంలుగా మారిపోవు అని మాజీమంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు. సీబీఐ దర్యాప్తునకు లేఖ రాశా సైట్ విజిట్ నిబంధనను 2018లోనే మొదలైందని చెప్పి. దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉదాహరణలుగా చెప్పి ఏం చెప్పదలుచుకున్నారు? అది తప్పు కాకుంటే నైనీ ఎందుకు రద్దు చేసినట్లు? అని మాజీమంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.ఇదే సైట్ విజిట్ విధానం సింగరేణిలో కూడా అమలు చేసామని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అని తెలిపారు.సైట్ విజిట్ అమలయ్యింది. నైనీ రద్దు జరిగింది అంటే.. స్కాం జరిగినట్లే కదా? అని ప్రశ్నించారు.డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అంటే నాకు చాలా గౌరవం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై విచారణ జరగాలంటే సిట్టింగ్ జడ్జీ లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ మాత్రమే చేయగలవు అన్న ఉద్దేశ్యంతోనే లేఖ రాశాను. మీరు నిజంగా రేవంత్ రెడ్డి, అతని బావమరిది కుంభకోణం మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తాను అని హామీ ఇస్తే మీకూ లేఖ రాయడానికి సిద్దం అని మాజీమంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలు ఇవే. సింగరేణిలో డీజిల్ సరఫరాను కాంట్రాక్టర్లకే అప్పగించడం ద్వారా మరో కుంభకోణానికి తెరలేపారన్న మాజీమంత్రి హరీశ్ రావు ఆరోపణలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. డీజిల్ సరఫరా విధానంలో మార్పులు కూడా తమ హయాంలో జరగలేదని, 2022లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఈ విధానం అమలులోకి వచ్చిందని తెలిపారు. జీఎస్టీ విధాన మార్పులు, డీజిల్ దొంగతనాలు నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.