పయనించే సూర్యుడు న్యూస్ : హైదరాబాద్–తిరువనంతపురం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ప్రస్తుతం హైదరాబాద్ చర్లపల్లి-ముజఫర్‌పుర్ (బిహార్) మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. అయితే తాజాగా హైదరాబాద్‌కు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ దక్కింది. ప్రస్తుతం హైదరాబాద్ చర్లపల్లి-ముజఫర్‌పుర్ (బిహార్) మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రోజున నాగర్‌కోయిల్-మంగళూరు, తిరువనంతపురం-తాంబరం, తిరువనంతపురం-చర్లపల్లి అమృత్ భారత్ రైళ్లను, త్రిసూర్ – గురువాయూర్ మధ్య కొత్త ప్యాసింజర్ రైలును ప్రారంభించారు. ఈ అమృత్ భారత్ రైళ్లలో ఏసీ కోచ్‌లు ఉండవు. స్లీపర్, జనరల్ బోగీలు మాత్రమే ఉంటాయి. దూర ప్రయాణాలు చేసే సామాన్య ప్రయాణికుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో ఈ అమృత్ భారత్ రైళ్లను సిద్దం చేశారు. ఈ అమృత్ భారత్ రైళ్లలో ఆర్‌ఏసీ టికెట్లు ఉండవని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. చర్లపల్లి-తిరువనంతపురం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఆగే స్టేషన్‌లు, టైమింగ్, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి. చర్లపల్లి – తిరునంతపురం (రైలు నంబర్17041) ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం ఉదయం 7.15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరువనంతపురం – చర్లపల్లి (రైలు నంబర్ 17042) ఎక్స్‌ప్రెస్ ప్రతి బుధవారం సాయంత్రం 5.30 గంటలకు తిరువనంతపురం నుంచి బయలుదేరి గురువారం రాత్రి 11.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. చర్లపల్లి – తిరువనంతపురం – చర్లప్లలి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్… నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుట్టణి, కాట్పాడి, జోలర్‌పేట, సేలం, ఈ రోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగనశెరి, తిరువల్లా, చెంగనూర్, మావెలికర, కాయంకుళం, కరునాగపల్లి, కొల్లాం, వర్కాల స్టేషన్‌లలో ఆగతుంది. ఈ రైలులో స్లీప్ క్లాస్ టికెట్స్‌ను రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ప్రకారం చర్లపల్లి నుంచి తిరువనంతపురం వరకు టికెట్ ధర రూ. 780గా ఉంది. గుంటూరు నుంచి తిరువనంతపురం వరకు టికెట్ ధర రూ. 685, రేణిగుంట నుంచి తిరువనంతపురం వరకు రూ. 550, నల్గొండ నుంచి తిరునంతపురం వరకు టికెట్ ధర రూ. 745గా ఉన్నాయి. ఇక, అమృత్ భారత్ రైళ్లు పూర్తిగా నాన్-ఏసీ ఈ రైళ్లలో 11 జనరల్ క్లాస్ కోచ్‌లు, 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 1 ప్యాంట్రీ కార్, దివ్యాంగులకు అనువైన కంపార్ట్‌మెంట్‌లతో కూడిన రెండు సెకండ్ క్లాస్-కమ్-లగేజ్-కమ్-గార్డ్ వ్యాన్‌లు ఉంటాయి. సాధారణ ప్రజల అవసరాలను తీర్చడానికి రూపొందించి, తయారు చేయబడిన ఈ రైళ్లు నాన్-ఏసీ విభాగంలోని ప్రయాణికులకు ఆధునిక, సౌకర్యవంతమైన, ఉన్నత నాణ్యత గల ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.