విదేశాల్లో భారతీయులు బానిసలుగా మారుతున్నారా?

★ కేంద్రాన్ని కోరిన ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ.

జనం న్యూస్: మయన్మార్-థాయిలాండ్ సరిహద్దులో చిక్కుకున్న భారతీయులను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కోరారు. థాయ్‌లాండ్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కోరారు. ఉద్యోగాల ఇస్తామంటే నమ్మి థాయ్‌లాండ్ వెళ్లిన 16 మంది భారతీయులు. ఏజెంట్ల చేతిలో మోసపోయి మయన్మార్-థాయిలాండ్ సరిహద్దులో చిక్కుకుపోయారని చెప్పారు. ప్రస్తుతం అక్కడ బానిసలుగా బతుకుతున్నారని పేర్కొన్నారు. వారిలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందినవారు కూడా ఉన్నారని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ వెంటనే జోక్యం చేసుకోవాలని. థాయ్‌లాండ్ మయన్మార్ సరిహద్దుల్లో చిక్కుకుపోయిన భారతీయుల ప్రాణాలు రక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. “నాకు ఒక బాధ కలిగించే సందేశం అందింది. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురుతో సహా కనీసం 16 మంది భారతీయులను థాయ్‌లాండ్‌లో ఉద్యోగాలు ఇస్తామనే హామీ ఇచ్చి మయన్మార్థాయిలాండ్ సరిహద్దుకు తీసుకెళ్లి బానిసలుగా మార్చారు. వారిని రోజూ 18-20 గంటలు పని చేయమని బలవంతం చేస్తున్నారు. వారిని శారీరకంగా శిక్షిస్తున్నారు, పాస్‌పోర్ట్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కనీస వైద్య సౌకర్యాలను అందుబాటులో లేకుండా చేశారు’’ అని అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్‌లో పోస్టు చేశారు. హైదరాబాద్‌ నుంచి అక్కడ చిక్కుకుపోయినవారిలో ఒకరు ఉస్మాన్‌నగర్‌కు చెందిన మీర్ సజ్జాద్ అలీ అని చెప్పారు. సజ్జాద్ అలీ ద్వారా ఈ సమచారం తెలిసిందని కూడా పేర్కొన్నారు. మరో ఇద్దరు హైదరాబాద్‌లోని మౌలాలీ, బంజారా హిల్స్‌కు చెందినవారని ఆయన అన్నారు.