పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన రాష్ట్రం

★ దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు.

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన సాగుతోంది. మంగళవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పారిశ్రామికవేత్తలతో భారత పరిశ్రమల సమాఖ్య బ్రేక్ ఫాస్ట్ సెషన్‌ నిర్వహించారు. ఈ సెషన్‌లో రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంబంధించి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన కొనసాగుతుంది. తొలిరోజు నుంచే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పారిశ్రామికవేత్తలతో భారత పరిశ్రమల సమాఖ్య బ్రేక్ ఫాస్ట్ సెషన్‌కు సీఎం చంద్రబాబు నాయుడు, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ హాజరయ్యారు. వీరితోపాటు మాస్టర్ కార్డ్ సీఏఓ, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ సహా విదేశీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్ కేంద్రంగా అభివృద్ధి- ఏపీ సానుకూలతలపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సహా 25 పాలసీలు. ఇంధనం, డిజిటల్ ఇన్ ఫ్రా, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులకు నెలకొన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ తదితర రంగాల్లో పెట్టుబడుల గురించి సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సహా 25 పాలసీలు, గ్రీన్ అమ్మోనియా, గూగుల్ పెట్టుబడుల గురించి సీఎం వివరించారు. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో సాధించిన పెట్టుబడులు, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పై పారిశ్రామిక వేత్తలకు సీఎం తెలిపారు. స్పేస్ సిటీ , పోర్టులు, ఎయిర్ పోర్టులు , హైవే కనెక్టివిటీ తదితర అంశాలపై దృష్టి పెట్టినట్టు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుపెట్టుబడుల్లో 25 శాతం ఏపీ ఆకర్షించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా సెషన్ కి హాజరైన జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా దగ్గరకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక-పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ – యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో కలిసి యూఏఈ దుబాయ్ ఫుడ్ క్లస్టర్‌ పని చేసేందుకు అల్ మార్రీ అంగీకారం తెలిపారు. అలాగే యూఈఏకి చెందిన సుమారు 40 సంస్థలు ఏపీలో ఏర్పాటు చేసేలా తోడ్పాటు అందిస్తామన్నారు. మరోవైపు ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి, పర్యాటకం, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను అల్ మార్రీకి ముఖ్యమంత్రి వివరించారు. యూఏఈకి చెందిన షరాఫ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై చర్చ జరిగింది. డీపీ వరల్డ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద స్థాయి పోర్ట్ టెర్మినల్స్. ‘లైట్ గేజ్ స్టీల్ ఫ్రేమింగ్ సాంకేతికతతో అమరావతిలో ఆధునిక నిర్మాణ యూనిట్ ఏర్పాటు. డీపీ వరల్డ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద స్థాయి పోర్ట్ టెర్మినల్స్, లాజిస్టిక్స్ మౌలిక వసతుల అభివృద్ధి. ఏడీఎన్‌ఓసీ సంస్థ ద్వారా ఫ్లోటింగ్ స్టోరేజ్, రీగ్యాసిఫికేషన్ యూనిట్ ఏర్పాటు. విశాఖలో లూలూ గ్రూప్ మెగా షాపింగ్ మాల్ నిర్మాణంపైనా సీఎం చంద్రబాబు నాయుడు యూఏఈ ఆర్థిక-పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ సమావేశంలో చర్చించారు.యూఏఈతో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఏపీలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు మరింత వేగంగా పెరుగుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ భవిష్యత్‌లో యూఏఈ ప్రభుత్వంతో పాటు ప్రముఖ సంస్థల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ పాల్గొన్నారు.