
జనం న్యూస్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కవిత చర్చలు జరుపుతున్నారని ప్రచారం సాగుతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ జాగృతిని పూర్తిస్థాయి రాజకీయ సంస్థగా మార్చడంపై దృష్టి సారించారు. తాను కొత్తగా ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ విషయమై కవిత. జన్ సూరాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో చర్చలు జరుపుతున్నారని ప్రచారం సాగుతుంది. ప్రశాంత్ కిషోర్ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారని. ఆయనతో కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి వివరణాత్మక చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. గత రెండు నెలల్లో ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్‌లో కవితను రెండుసార్లు కలిశారని. సంక్రాంతి సమయంలో ఇరువురి మధ్య వివరణాత్మక చర్చలు జరిగాయని ఆ నివేదికలు పేర్కొన్నాయి. తెలంగాణ ప్రజల కోసం కొత్త పార్టీని ఏర్పాటు చేయడం, ప్రజలు ఆ పార్టీని నిజంగా తమదిగా భావించేలా చేయడం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఎలా పనిచేయాలి?, దీర్ఘకాలిక రాజకీయ ప్రణాళికలు. వంటి అంశాలపై కవిత, ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపారని కూడా మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. కొత్త రాజకీయ పార్టీని తీర్చిదిద్దడంలో కవితతో కలిసి పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్ ఆసక్తి చూపినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో కవిత అధికారికంగా పార్టీని ప్రారంభించినట్లు ప్రకటిస్తే. పార్టీ ఏర్పాటు, తెరవెనక వ్యూహాలు రూపొందించడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ కిషోర్. ఈ వార్తలను ఖండించారు. కవితతో తాను సమావేశమైనట్టుగా వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని ప్రశాంత్ కిషోర్ తెలిపనట్టుగా ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది. మరోవైపు కవితకు సన్నిహిత వర్గాలు మాత్రం. కవిత, ప్రశాంత్ కిషోర్ల మధ్య చర్చలు జరిగాయని చెప్పారని కూడా పేర్కొంది. గత రెండు నెలల్లో కిషోర్ రెండుసార్లు హైదరాబాద్‌కు వచ్చి కవితతో సమావేశాలు నిర్వహించారని. సంక్రాంతి సమయంలో ఈ చర్చలు దాదాపు ఐదు రోజుల పాటు కొనసాగాయని తెలిపారని రిపోర్టు చేసింది. అయితే మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి తెలంగాణ జాగృతి ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.