
సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన రిజర్వేషన్లు పురపాలక శాఖ ఖరారు చేసింది.తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పదవీకాలం ముగిసింది. ఈ క్రమంలో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో 2996 వార్డులు, డివిజన్లలో ఎన్నికలు జరపాల్సి ఉంది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయిన సంగతి తెలిసిందే. అందుకే ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో రంజాన్, శివరాత్రి పండుగలు ఉన్నందున ఎన్నికల ప్రక్రియకు ఇబ్బంది లేకుండా ఎన్నికల షెడ్యూల్ రూపొందించుకోవాలని కేబినెట్ అధికారులకు సూచించింది.తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఇన్చార్జిలను ప్రకటించారు. మున్సిపల్ ఇన్చార్జిల నియామకం. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సీఎం రేవంత్ రెడ్డి ఇన్‌చార్జ్‌లను నియమించింది.పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జరగబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. అయితే ఆదిలాబాద్ ఇన్చార్జిగా మాత్రం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని నియమించారు.ఆదిలాబాద్ - సుదర్శన్ రెడ్డి. జామాబాద్ - ఉత్తమ్‌కుమార్ రెడ్డి మల్కాజ్గిరి - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేవెళ్ల - శ్రీధర్‌బాబు మెదక్ - వివేక్ కరీంనగర్ - తుమ్మల నాగేశ్వరరావు పెద్దపల్లి - జూపల్లి కృష్ణారావు నల్గొండ - అడ్లూరి లక్ష్మణ్ భువనగిరి - సీతక్క వరంగల్ - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మహబూబ్‌నగర్ - పొన్నం ప్రభాకర్ మహబూబ్‌నగర్ - దామోదర రాజనర్సింహా జహీరాబాద్ - జహరుద్దీన్ నాగర్‌కర్నూల్ - వాకిటి శ్రీహరి ఖమ్మం - కొండా సురేఖ 10 కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన రిజర్వేషన్లు పురపాలక శాఖ ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డులు, చైర్పర్సన్, మేయర్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అన్రిజర్వ్డ్ కేటగిరీలకు సీట్ల కేటాయింపునకు మార్గదర్శకాలను కూడా ప్రకటించింది. మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించరాదని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్(అన్‌రిజర్వుడ్) విభాగాల్లోని మొత్తం సీట్లలో 50 శాతం మహిళలకు కేటాయించాలని స్పష్టం చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ కోటాలు; డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీల కోటా, తెలంగాణ రాష్ట్ర మునిసిపాలిటీల చట్టం, 2019 ప్రకారం మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కేటాయింపులు జరిగాయి. మహిళా రిజర్వేషన్ లాటరీ విధానంలో ఖరారు చేయనున్నారు.గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మొత్తం 10 కార్పొరేషన్లు, 121 మునిసిపాలిటీలకు పురపాలక శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసింది. 10 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాలకు సంబంధించి ఎస్సీలకు ఒకటి, ఎస్టీలకు ఒకటి, బీసీలకు మూడు (జనరల్ 2, మహిళలకు 1), అన్రిజర్వ్డ్(ఓసీ)లో జనరల్‌కు ఒకటి, మహిళలకు 4 ఖరారు చేశారు. 121 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు. 121 మున్సిపాలిటీలలో ఎస్టీలకు 5 (3 జనరల్, 2 మహిళలు)లకు, ఎస్సీలకు 17 (9 జనరల్, 8 మహిళలు), బీసీలకు 38 (19 జనరల్, 19 మహిళలు), అన్రిజర్వ్డ్(ఓసీ)లో జనరల్‌కు 30, మహిళలకు 31 మున్సిపాలిటీలను కేటాయించారు. అలాగే, ప్రతి మున్సిపాలిటీలో మొత్తం వార్డుల సంఖ్య ఖరారు చేయడమే కాకుండా... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, అన్రిజర్వ్డ్ సీట్ల కోటాకు సంబంధించి స్పష్టమైన విభజన చేసింది.