
సాక్షి డిజిటల్ న్యూస్: పోలీసుల అధికారులలో కొందరు డ్యూటీలో ఉన్న కూడా విధుల విషయంలో అలసత్వంగా వ్యవహరిస్తారనే అపవాదు ఉంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ మాత్రం తాను ఆఫ్ డ్యూటీలో ఉన్న కూడా తన విధి నిర్వాహణకు సిద్దమయ్యారు. పోలీసుల అధికారులలో కొందరు డ్యూటీలో ఉన్న కూడా విధుల విషయంలో అలసత్వంగా వ్యవహరిస్తారనే అపవాదు ఉంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ మాత్రం తాను ఆఫ్ డ్యూటీలో ఉన్న కూడా తన విధి నిర్వాహణకు సిద్దమయ్యారు. చేతిలో పసికందు ఉన్ని సరే ట్రాఫిక్ జామ్ క్లియర్ చేశారు. తద్వారా ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్ ముందుకు సాగేందుకు వీలు కల్పించారు. వివరాలు.. జయశాంతి కాకినాడ జిల్లాలోని శంఖవరం గ్రామానికి చెందినవారు. 2016లో కానిస్టేబుల్ పరీక్ష రాసి విజయం సాధించారు. కానిస్టేబుల్‌గా ఎంపికై గోకవరంలో విధుల్లో చేరారు. ఆ తర్వాత ఐదేళ్లపాటు రైల్వే పోలీసుగా పనిచేశారు. ఐదు నెలల క్రితం ఆమె రంగంపేట పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. శనివారం రాత్రి రంగంపేట పోలీస్ స్టేషన్‌లో తన డ్యూటీ పూర్తి చేసుకున్నారు. అనంతరం తన రెండున్నరేళ్ల కొడుకును తీసుకుని కాకినాడ వెళ్లడానికి బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఆమెకు తెలిసిన కుటుంబం కారులో కాకినాడ వెళ్తుండటంతో వారితో పాటు కారులో కాకినాడ బయలుదేరింది. అయితే కాకినాడ – సామర్లకోట రోడ్డులో ట్రాఫిక్ జామ్ తలెత్తింది. అంతేకాకుండా, ట్రాఫిక్‌లో అంబులెన్స్ కూడా చిక్కుకుపోయింది. దీంతో తాను ఆఫ్ డ్యూటీలో ఉన్నప్పటికీ... ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు జయశాంతి ముందుకు వచ్చారు. చేతిలో తన బిడ్డను పట్టుకుని... వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ జామ్ గురించి సమాచారం అందుకున్న ఏరియా ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే మహిళా కానిస్టేబుల్ జయశాంతి ట్రాఫిక్‌ను క్లియర్ చేయడం గమనించి, వారు కూడా ఆమెతో చేతులు కలిపి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు దారి చూపించారు. ఆ తర్వాత మొత్తం ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. చేతిలో పసిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు జయ శాంతి చేసి ప్రయత్నాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ అయింది. దీంతో జయశాంతిని పలువురు ప్రశంసలతో ముంచెత్తారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ నుంచి కూడా జయశాంతిని ప్రశంసలు అందుకున్నారు. ఆమెకు రివార్డు కూడా ప్రకటించారు.