రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

★ ‘చూసి జాలి వేస్తోంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు.

జనం న్యూస్: ‘వంట వండి వడ్డనకు సిద్ధం చేస్తే.. గంటె పట్టుకొని ఫోటోలకు పోజులివ్వడం రేవంత్ రెడ్డికే చెల్లింది.ప్రాజెక్టులు కట్టడం బిఆర్ఎస్ వంతు, వీసమెత్తు కృషి చేయని కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టి మనోభావాలను అవమానించడం కాంగ్రెస్ వంతు. రెండేళ్ల పాలనలో చేసింది లేదు. చెప్పుకునేందుకు ఏదీ లేదు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లు.. సీఎం పదవి కలిసొచ్చిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, ఉద్యోగ నియామకపత్రాలు రెడీ మేడ్‌గా తయారై ఉన్నాయి.క్రెడిట్ కొట్టేయడం మీద ఉన్న శ్రద్ధ.. పాలన మీద, ప్రాజెక్టుల మీద పెడితే ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుంది’అని మాజీమంత్రి హరీశ్ రావు సూచించారు. ‘తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు కడితే. వాటిపై కాంగ్రెస్ స్టిక్కర్లు వేసుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్భకత్వాన్ని చూసి జాలి వేస్తోంది.’అని మాజీమంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.‘రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నిర్మించిందేం లేక కేసీఆర్ గారు పూర్తి చేసిన ప్రాజెక్టులు, నిర్మాణాలకు రిబ్బన్ కట్ చేయడమే పనిగా పెట్టుకున్నడు రేవంత్ రెడ్డి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లు.. సీఎం పదవి కలిసొచ్చిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, ఉద్యోగ నియామకపత్రాలు రెడీ మేడ్‌గా తయారై ఉన్నాయి.’అని మాజీమంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు. ‘తట్టెడు మట్టి తీసింది లేదు, ఒక్క ఇటుక వేసింది లేదు అయినా చనాకా కొరటా, సదర్మాట్ బ్యారేజీలను తామే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకున్న నేటి మీ సభ మీరు చెప్పినట్లే.. చరిత్రలో నిలబడుతుంది ఉత్తమ్ రెడ్డి’అని మాజీమంత్రి హరీశ్ రావు వెల్లడించారు. క్రెడిట్ కొట్టేయడంపై సీఎం రేవంత్ రెడ్డి శ్రద్ధ. ‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకొని...రూ.1200 కోట్లు ఖర్చు పెట్టి చనాకా-కొరాటా బ్యారేజీ, పంప్ హౌస్‌లు, మెయిన్ కెనాల్, సబ్ స్టేషన్లతో సహా పనులు పూర్తి చేయించారు.2023 సెప్టెంబర్‌లోనే సక్సెస్‌ఫుల్‌గా వెట్ రన్ కూడా పూర్తి చేశారు.’అని మాజీమంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు.‘ప్రాజెక్టుకు కాలువల పనులకు అవసరమైన 3,200 ఎకరాల్లో 1600 ఎకరాలను కేసీఆర్ గారు సేకరిస్తే.. ఈ రెండేళ్లలో ఒక్క ఎకరా భూమి కూడా సేకరించలేని నువ్వు, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వని నువ్వు.. ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ రీ-రన్ (వెట్ రన్) డ్రామాలు ఆడుతున్నావు?.రెండేళ్లుగా భూమి సేకరించకుండా, కాలువలు తవ్వకుండా.. ఆదిలాబాద్ ప్రజలను మోస పుచ్చారు.క్రెడిట్ కొట్టేయడం మీద ఉన్న శ్రద్ధ.. భూసేకరణ మీద పెట్టి ఉంటే ఈపాటికి ప్రాజెక్ట్ ఫలితాలు రైతులకు దక్కేవి.’అని మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. ‘1.5 TMCల సామర్థ్యంతో కేసీఆర్ రూ.500 కోట్లతో సదర్మాట్ బ్యారేజీని సిద్ధం చేస్తే. రెండేళ్లుగా చుక్క నీరు నిలపకుండా ఉమ్మడి ఆదిలాబాద్ రైతుల నోట్లో మట్టి కొట్టారు. రెండేళ్ల క్రిందనే 18 వేల ఎకరాల ఆయకట్టును నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా, ఇవ్వకున్నా రైతులకు తీరని అన్యాయం చేసారు.ఇప్పుడు సిగ్గులేకుండా రిబ్బన్ కట్ చేస్తూ అంతా మీ ఘనతే అని డబ్బా కొట్టుకోవడం మీ దగుల్భాజీతనానికి పరాకాష్ట.’అని మాజీమంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు.‘ఈ రెండేళ్ల కాలం వృథా చేసినందుకు ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు పంచడం.. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేయడం తప్ప సొంతంగా మీరు చేసిందేం లేదు.బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టుకు సున్నాలు వేసి నాదే అని చాటింపు వేసుకోవడం మీ అల్పబుద్దికి నిదర్శనం. ప్రాజెక్టులు కట్టడం మా వంతు, పేర్లు పెట్టుకోవడం మీ వంతు పరిపాటిగా మారింది.’మాజీమంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. తమ్మిడిహట్టి దగ్గర ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తలేకపోయారు. ‘లోయర్ పెన్ గంగా ప్రాజెక్టు పేరు చెప్పుకొని రెండు సార్లు ఎన్నికల్లో గెలిచి, ప్రజల్ని మోసం చేసిన సి. రామచంద్రారెడ్డి పేరు ప్రాజెక్టుకు పెట్టడం అంటే ఆదిలాబాద్ ప్రజల మనోభావాలను అవమానించడమే.ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ ప్రజల కలలు సాకారం చేసింది బీఆర్ఎస్ అయితే ఆ ప్రాజెక్టు నిర్మాణంలో వీసమెత్తు కృషి చేయని వ్యక్తి పేరు పెట్టి మోసం చేస్తున్నది కాంగ్రెస్. ఆదిలాబాద్ వెనుకబాటు తనానికి, పాలమూరు వలసలకు కారణం దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదా?’అని మాజీమంత్రి హరీశ్ రావు నిలదీశారు.‘తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడుతామని చెప్పి రెండేళ్లు గడిచినా ఒక్క తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేక పోయారు?. తమ్మిడిహట్టి పేరు మీద అప్పుడు ఆరేండ్లు, ఇప్పుడు రెండేళ్లు కాలయాపన చేశారు. మాయ మాటలు చెప్పి అదిలాబాద్ జిల్లాకు తీరని ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.’అని మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.