114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై భారత్ ఆలోచన

*అంచనా వ్యయం ఎంత?

సాక్షి డిజిటల్ న్యూస్ : భారతదేశ రక్షణ రంగం శక్తిని బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఫ్రాన్స్ నుంచి పెద్ద సంఖ్యలో రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడంపై కేంద్ర రక్షణ శాఖ దృష్టిసారించింది. భారతదేశ రక్షణ రంగం శక్తిని బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఫ్రాన్స్ నుంచి పెద్ద సంఖ్యలో రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడంపై కేంద్ర రక్షణ శాఖ దృష్టిసారించింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ వారం నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమావేశంలో దాదాపు రూ.3.25 లక్షల కోట్లతో 114 రాఫెల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ప్రతిపాదిత ఒప్పందంపై చర్చించనుంది. ఇందుకు సంబంధించి భారత రక్షణ శాఖ నిర్ణయం తర్వాత… ఈ ప్రతిపాదనకు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తుది అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇరుదేశాల మధ్య ఇందుకు సంబంధించి ఒప్పందంపై చర్చలు జరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అగ్రశ్రేణి రక్షణ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం… ఈ ప్రతిపాదనలో భాగంగా భారత వైమానిక దళం కోసం సుమారు 12-18 రఫేల్ జెట్‌లను సిద్ధంగా ఉన్న స్థితిలో కొనుగోలు చేయడం కూడా ఉంటుంది. అంటే ఈ రఫేల్ యుద్ద విమానాలను వెంటనే భారత అమ్ములపొదిలో ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ విమానాలలో భారతీయ ఆయుధాలు, ఇతర స్వదేశీ వ్యవస్థలను అనుసంధానించడానికి వీలు కల్పించాలని కూడా భారత ప్రతినిధులు ఫ్రాన్స్‌ను కోరనుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… అగ్రదేశాలు అమెరికా, రష్యా కూడా భారతదేశానికి నెక్ట్స్ జనరేషన్ యుద్ధ విమానాలను ఆఫర్ చేశాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎఫ్-35, రష్యా ఎస్‌యూ-57 వంటి తమ ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళానికి ఆఫర్ చేసినప్పటికీ… భారతదేశం ఫ్రాన్స్‌తో ఈ ఒప్పందం చేసుకోవడానికి ముందుకు సాగేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం… ఈ రఫేల్ యుద్ద విమానాలలో స్వదేశీ భాగాల శాతం కేవలం 30 శాతం మాత్రమే ఉంటుంది. సాధారణంగా మేక్ ఇన్ ఇండియా ఒప్పందాలలో అవసరమయ్యే స్వదేశీ భాగాల శాతం సుమారు 50-60 శాతం ఉంటుంది. ఇక, ఈ ఒప్పందానికి ఆమోదం లభిస్తే ఇది భారతదేశపు చరిత్రలోనే అతిపెద్ద రక్షణ ఒప్పందంగా నిలుస్తుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో రఫేల్ యుద్ద విమానాలు అత్యంత సమర్ధవంతంగా పనిచేశాయి. ఆ తర్వవాత భారత వైమానిక దళం రూపొందించిన 114 రాఫెల్ జెట్‌ల ప్రతిపాదన లేదా కేసు ప్రకటన (SoC) కొన్ని నెలల క్రితం రక్షణ మంత్రిత్వ శాఖకు అందింది. దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించనున్నారు. ఇక, ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే భారత సైన్యంలో రఫేల్ జెట్‌ల సంఖ్యను 176కి పెరగనుంది. ఎందుకంటే భారత వైమానిక దళం వద్ద ఇప్పటికే 36 రఫేల్ యుద్ద విమానాలు ఉన్నాయి. అలాగే భారత నావికాదళం గత సంవత్సరం 26 విమానాలకు ఆర్డర్లు ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *