మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు

*ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే

సాక్షి డిజిటల్ న్యూస్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈనెల 28 నుంచి 31వరకు జరగనున్న సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈనెల 28 నుంచి 31వరకు జరగనున్న సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే మేడారం మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాటు చేపట్టింది. మేడారంలో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ది పనులు కూడా చివర దశకు చేరుకున్నాయి. మేడారం జాతరకు తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారనే సంగతి తెలిసిందే. అయితే జాతర సమయంలో రద్దీ విపరీతంగా ఉంటుందని భావించి… జాతర ప్రారంభానికి ముందే కొందరు భక్తులు మేడారంను సందర్శించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో ఇప్పటికే మేడారంలో సందడి వాతావరణం నెలకొంది. వీకెండ్స్‌లో అయితే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అయితే ఈ ఏడాది మేడారం మహా జాతరకు 3 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతరకు అంతా సిద్ధమైందని మంత్రి సీతక్క తెలిపారు. మేడారం జాతర పనులను మరోసారి పర్యవేక్షించిన సీతక్క… ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఏడాది మేడారం మహా జాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. జాతర కోసం 21 విభాగాలకు చెందిన మొత్తం 42,027 మంది అధికారులు, సిబ్బందితో పాటు 2,000 మంది గిరిజన యువ వాలంటీర్లు విధుల్లో ఉండనున్నారని చెప్పారు. ఇక, మేడారం జాతరకు సంబంధించిన అభివృద్ది పనులకు సంబంధించిన ఫొటోలను కూడా సీతక్క తన ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *