భోగి మంటల్లోకి జగన్ బొమ్మ పాసు పుస్తకాలు

★ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలో నిరసన.

జనం న్యూస్: విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వినూత్న రీతిలో భోగి వేడుకలను నిర్వహించారు. గత ప్రభుత్వంలో ప్రజల ఆస్తులపై జగన్ బొమ్మ వేసుకుని దోపిడీ చేశారని ఆరోపిస్తూ ఆ పాస్ బుక్ ప్రతులను భోగిమంటల్లో వేసి దగ్ధం చేశారు . ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బొమ్మలను తొలగించి అసలు రాజముద్రతో పాస్‌బుక్‌లు జారీ చేశామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లొ సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భోగి మంటలు వేసి సంక్రాంతి సందడిని ప్రారంభించారు ప్రజలు. విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ భోగి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.గంగరెద్దులతో విన్యాసాలు ఆహుతులను అలించాయి. ఇదే సందర్భంలో గత వైసీపీ ప్రభుత్వం జగన్ బొమ్మతో రైతులకు ఇచ్చిన పాస్‌బుక్‌లను ఎంపీ కేశినేని చిన్ని భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. మరోవైపు వైసీపీ సైతం వినూత్నంగా భోగి వేడుకలు జరిగింది. మెడికల్ కాలేజీలకు సంబంధించి జీవోలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. భోగిమంటల్లో గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు దగ్ధం. గత ప్రభుత్వంలో ప్రజల ఆస్తులపై జగన్ బొమ్మ వేసుకుని దోపిడీ చేశారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బొమ్మలను తొలగించి అసలు రాజముద్రతో పాస్‌బుక్‌లు జారీ చేశామని స్పష్టం చేశారు.గత ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ భోగి మంటల్లో జగన్ బొమ్మ ఉన్న పాస్‌బుక్‌లను కాల్చేశామని ఎంపీ చెప్పుకొచ్చారు.మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించిన జీవోలను కూడా వైసీపీ ప్రభుత్వమే తెచ్చిందని...ఇప్పుడు వైసీపీ నేతలే వాటిని భోగి మంటల్లో వేసి కాల్చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో విజయవాడ అభివృద్ధికి నోచుకోలేదని. ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించడంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి పెద్ద ప్రాజెక్టులు చేపట్టారని, పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని చెప్పుకొచ్చారు. మెడికల్ కాలేజీల జీవోలను దగ్ధం చేసిన వైసీపీ. మరోవైపు మెడికల్ కాలేజీల పీపీపీని వ్యతిరేకిస్తూ బుధవారం జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు వైసీపీ నేతలు. ఇదే క్రమంలో గుంటూరు జిల్లా కేంద్రంలో మాజీమంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకల్లో మాజీమంత్రి అంబటి రాంబాబు మెడికల్ కాలేజీల జీవోలను దగ్ధం చేశారు. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగాలి అని డిమాండ్ చేశారు. ఆ జీవోను ఉపసంహరించుకునేంత దాకా మా పోరాటం కొనసాగుతుంది. ఈ పాలన ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలడం ఖాయం అని మాజీమంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు.