రాజధానిపై అనవసర రాద్దాంతం తగదు

★ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై అనవసర రాద్దాంతాలు వద్దు అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హితవు పలికారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి చిన్న నగరం కాదని రాబోయే రోజుల్లో మహానగరంగా ఆవిష్కరించబోతుంది అని చెప్పుకొచ్చారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానకి గుండెలా పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. అమరావతి ప్రాంతం రాష్ట్రానికి మధ్యలో ఉంది అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండెలా పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. అమరావతి ప్రాంతం రాష్ట్రానికి మధ్యలో ఉంది అని చెప్పుకొచ్చారు.అయితే కొందరు అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని...అది తగదని హితవు పలికారు.అమరావతిపై అనవసర రాద్ధాంతాలు వద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో స్వర్ణ భారత్‌ ట్రస్టులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడారు.తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా పోయిందని...అందుకే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అమరావతిని రాజధానిగా గుర్తించి, అక్కడ అభివృద్ధి పనులను జోరుగా కొనసాగిస్తున్నాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. అమరావతి అంటే కేవలం ఒక చిన్న గ్రామం కాదని విజయవాడ, గుంటూరు, గన్నవరం, మంగళగిరి ఇలా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కలిసి ఒక పెద్ద నగరంగా మారనుంది అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హాస్య నటుడు బ్రహ్మానందం, ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు కూడా పాల్గొన్నారు. రెండో దశ ల్యాండ్ ఫూలింగ్ ప్రక్రియ. ఇదిలా ఉంటే ఏపీ రాజధాని అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు మండలం కర్లపూడి - లేమల్లె గ్రామాల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ ఈ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌తో కలిసి నారాయణ రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు. తమ వద్దకు వచ్చిన మంత్రి, ఎమ్మెల్యేలకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో స్వాగతించారు. తమ గ్రామాలను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి రైతులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.7 గ్రామాల్లో భూ సమీకరణ. రెండో దశ ల్యాండ్ పూలింగ్ విధానంలో మొత్తం 7 గ్రామాల్లో భూసమీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో పల్నాడు జిల్లా అమరావతి మండలంలో వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో వడ్డమాను,హరిశ్చంద్రపురం,పెదపరిమి గ్రామాలు ఉన్నాయి. ఇప్పటివరకు 4 గ్రామాల్లో ప్రక్రియ ప్రారంభమైంది అని అధికార యంత్రాంగం తెలిపింది. ఈ భూములను అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా నగరం (ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ), స్మార్ట్ పరిశ్రమలు, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి పెద్ద ప్రాజెక్టుల కోసం ఉపయోగించనున్నట్టు పేర్కొంది.మొదటి దశలో 34,000 ఎకరాలు ఇప్పటికే పూల్ అయ్యాయని తాజాగా రెండో విడత ల్యాండ్ ఫూలింగ్‌తో అమరావతి ఒక మహానగరంగా విస్తరించే అవకాశం ఉంది.