
సాక్షి డిజిటల్ న్యూస్: భారత్‌లో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలపై కీలక ప్రకటనలు చేశారు. అమెరికా భారత్ అత్యంత ప్రాధాన్యత కలిగిన భాగస్వామి అని ఉద్ఘాటించారు. భారత్‌లో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలపై కీలక ప్రకటనలు చేశారు. అమెరికా భారత్ అత్యంత ప్రాధాన్యత కలిగిన భాగస్వామి అని ఉద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సెర్గియో గోర్ అత్యంత సన్నిహితుడనే సంగతి తెలిసిందే. అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేని విధంగా క్షీణించిన వేళ భారతదేశంలో అమెరికా రాయబారిగా ట్రంప్ సన్నిహితుడైన సెర్గియో గోర్ గతేడాది నియమితులయ్యారు. గతంలోనే ఢిల్లీకి చేరుకున్న సెర్గియో గార్గ్... తాజాగా సోమవారం భారతదేశంలో కొత్త అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ బాధ్యతలు స్వీకరించారు. భారతదేశంలో అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సెర్గియో గోర్ విలేకరులతోో మాట్లాడుతూ... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే ఒకటి లేదా రెండు సంవత్సరాలలో భారతదేశాన్ని సందర్శించాలని ఆశిస్తున్నారని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ట్రంప్ వ్యక్తిగత స్నేహం "నిజమైనది" అని అభివర్ణించారు. భారత్ కంటే ముఖ్యమైన భాగస్వామి మరొకరు లేరని చెప్పారు. అమెరికా నేతృత్వంలోని ప్రతిష్టాత్మక 'పాక్స్ సిలికా' కూటమిలో చేరాల్సిందిగా భారత్‌ను వచ్చే నెలలో అధికారికంగా ఆహ్వానించ నున్నట్లు సెర్గియో గోర్ ప్రకటించారు. ఇది సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లిష్టమైన ఖనిజాలు, సప్లై చైన్స్ భద్రత కోసం ఏర్పాటు చేసిన వ్యూహాత్మక కూటమి. జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్, ఇజ్రాయెల్ ఇప్పటికే ఇందులో సభ్యులుగా ఉన్నాయి. ఇక, భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు చురుగ్గా సాగుతున్నాయని... రేపే (మంగళవారం) దీనిపై కీలక చర్చలు జరగనున్నాయని సెర్గియో గోర్ వెల్లడించారు. ‘‘అమెరికా రాయబారిగా ఇక్కడ ఉండటం చాలా బాగుంది. నేను ఈ అద్భుతమైన దేశానికి అపారమైన గౌరవం, మన రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలనే స్పష్టమైన లక్ష్యంతో వచ్చాను. ఇది ప్రపంచంలోని అత్యంత పురాతన ప్రజాస్వామ్యం (అమెరికా) మరియు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం (భారత్) ల కలయిక. నేను చివరిసారిగా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి భోజనం చేసినప్పుడు... ఆయన తన గత భారత పర్యటనను, భారత ప్రధానితో (మోదీతో) తనకున్న గొప్ప స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్ త్వరలో భారతదేశాన్ని సందర్శిస్తారని నేను ఆశిస్తున్నాను... రాబోయే ఒకటి లేదా రెండు సంవత్సరాలలో ట్రంప్ పర్యటన ఉండొచ్చు. అధ్యక్షుడు ట్రంప్‌కు తెల్లవారుజామున 2 గంటలకు (పనులు చేసే) అలవాటు ఉంది, న్యూఢిల్లీతో ఉన్న సమయ వ్యత్యాసం దృష్ట్యా అది మనకు బాగా కలిసి వస్తుంది. వచ్చే నెలలో పాక్స్సిలికాలో పూర్తిస్థాయి సభ్య దేశంగా చేరడానికి భారతదేశాన్ని ఆహ్వానించనున్నట్లు ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. గత నెలలో అమెరికా ప్రారంభించిన పాక్స్‌సిలికా అనే కొత్త చొరవను కూడా నేను ఈరోజు మీతో పంచుకోవాలను కుంటున్నాను. పాక్స్‌సిలికా అనేది కీలకమైన ఖనిజాలు, ఇంధన ఇన్పుట్ల నుంచి అధునాతన తయారీ, సెమీకండక్టర్లు, ఏఐ అభివృద్ధి, లాజిస్టిక్స్ వరకు సురక్షితమైన, సంపన్నమైన, ఆవిష్కరణ-ఆధారిత సిలికాన్ సప్లై చైన్‌ను నిర్మించడానికి అమెరికా నేతృత్వంలోని వ్యూహాత్మక చొరవ. గత నెలలో చేరిన దేశాలలో జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్, ఇజ్రాయెల్ ఉన్నాయి. వచ్చే నెలలో పూర్తి సభ్య దేశంగా ఈ దేశాల సమూహంలో చేరడానికి భారతదేశాన్ని ఆహ్వానించనున్నట్లు ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను...’’ అని సెర్గియో గోర్ పేర్కొన్నారు.