పోలవరం ప్రాజెక్టు అంశంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

* నల్లమలసాగర్ రిట్ ఉపసంహరణ.

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పొలవరం – నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు కోసం సన్నాహక, ప్రాజెక్టు సంబంధిత కార్యకలాపాలను కొనసాగించకుండా ఏపీ ప్రభుత్వాన్ని నిరోధించాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. గోదావరి జలాల కేటాయింపులో ఉల్లంఘనలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. అయితే సివిల్‌ సూట్‌‌ను దాఖలు చేయనున్నట్టుగా అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. ఈ క్రమంలోనే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ ప్రాథమికంగా చూస్తే ఈ పిటిషన్ విచారణకు స్వీకరించదగ్గది కాదని పేర్కొంటూ డిస్పోజ్ చేశారు. అలాగే ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు పిటిషనర్ (రాష్ట్ర ప్రభుత్వం) తమ సమస్యలన్నింటినీ లేవనెత్తడానికి తగిన వేదికను/అధికార పరిధిని ఆశ్రయించే స్వేచ్ఛను కల్పిస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై అభ్యంతరాలను లేవనెత్తుతూ రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో గత సోమవారం కూడా విచారణ జరిగిందని, ఈరోజు మరోమారు విచారణ జరిగిందని చెప్పారు. సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలను వినిపించామని తెలిపారు. గోదావరి జలాల్లో కేటాయింపుల కంటే ఎక్కువ నీళ్లు వాడొద్దనేది ముఖ్యమైన అంశమని అన్నారు. ఏపీ సర్కార్ అనేక ఉల్లంఘనలు పాల్పడిందని ఆరోపించారు. ఈ అంశాలను సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ను అమలు చేయడం లేదని తెలిపామని చెప్పారు. ఏపీకి కేటాయించింది 484.5 టీఎంసీలు అని అయితే కేటాయింపుల కంటే ఎక్కువగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ముందుకెళ్తోందనే విషయాన్ని సుప్రీం కోర్టు ధర్మాసనం ఎదుట వివరించామని తెలిపారు. ముందుగా డిజైన్ చేసిన దాని కంటే అదనంగా ఏమీ చేయడానికి వీల్లేదని వాదనలు వినిపించామని చెప్పారు. రిట్ పిటిషన్ కాకుండా సూట్ ఫామ్‌లో రావాలని కోర్టు స్పష్టం చేసిందని అన్నారు. మరో రెండు రోజుల్లో సివిల్ సూట్ దాఖలు చేస్తామని తెలిపారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడటం కోసం ఎందాకైనా పోరాడుతామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *